లిండా యాకారినో 2011 నుండి NBC యూనివర్సల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు, ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె ప్రస్తుతం గ్లోబల్ అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్‌ల చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌కు నాయకత్వం వహించేందుకు కొత్త సీఈవో వస్తారని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో ట్విట్టర్ కొత్త సీఈవో ఎవరనే ఊహాగానాలు అందరిలో మొదలయ్యాయి. NBC యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ హెడ్ లిండా యాకారినో ట్విట్టర్ కొత్త సీఈఓ అవుతారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ కొత్త సీఈవో వచ్చే ఆరు వారాల్లోగా ట్విట్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే లిండా యాకారినో ఎవరు.. ?
లిండా యక్కరినో గురించి కొన్ని విషయాలు..
1. లిండా యాకారినో 2011 నుండి NBC యూనివర్సల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు, ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె ప్రస్తుతం గ్లోబల్ అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్‌ల చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.
2. కంపెనీ కేబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ సేల్స్ విభాగానికి లిండా యాకారినో నాయకత్వం వహించారు. NBCUniversalకి రాకముందు linda Yaccarino టర్నర్‌లో 19 సంవత్సరాలు పనిచేశాడు.
3. టర్నర్‌లో లిండా యక్కరినో చివరిగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ సేల్స్ COOగా ఉన్నారు. లిండా యక్కరినో పెన్ స్టేట్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి.
4. వాల్ స్ట్రీట్ జర్నల్ నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, అడ్వాటైజింగ్ ప్రభావాన్ని కొలిచే పద్ధతులను మెరుగుపరచడానికి Yaccarino బాధ్యత వహించారు.
5. లిండా యాకారినో గతంలో తన స్నేహితులకు ట్విట్టర్ సీఈఓ కావాలనే కోరికను వ్యక్తం చేశారు. ఆమె ఎలోన్ మస్క్‌కి మద్దతుదారుగా ఉండాలనుకుంది.