48 గంటలు సముద్రంలో ఐఫోన్: ఎలా పనిచేస్తోందో తెలుసా?

Published : Jul 17, 2018, 02:42 PM IST
48 గంటలు సముద్రంలో ఐఫోన్: ఎలా పనిచేస్తోందో తెలుసా?

సారాంశం

స్మార్ట్‌ఫోన్  కానీ, మామూలు ఫోన్ కానీ నీళ్లలో పడితే  పనిచేయదు. ఆ ఫోన్ ను రిపేర్ చేయిస్తేనే  పనికొచ్చే అవకాశం ఉంటుంది.  లేదా ఆ ఫోన్‌లో పాడైన బాగాలను మార్చితే ఫోన్ పనిచేసే అవకాశాలు లేకపోలేదు. 


 కెనడా: స్మార్ట్‌ఫోన్  కానీ, మామూలు ఫోన్ కానీ నీళ్లలో పడితే  పనిచేయదు. ఆ ఫోన్ ను రిపేర్ చేయిస్తేనే  పనికొచ్చే అవకాశం ఉంటుంది.  లేదా ఆ ఫోన్‌లో పాడైన బాగాలను మార్చితే ఫోన్ పనిచేసే అవకాశాలు లేకపోలేదు.  ఆపిల్ ఐఫోన్ సముద్రంలో  పడినా ఆ ఫోన్  పనిచేస్తోందని  తేలింది.

ఆపిల్ 7 ఐఫోన్   సముద్రంలో పడిపోయినా  పనిచేసింది. ఆ ఫోన్ ఎక్కడ పడిపోయిందో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కనిపెట్టారు.  కెనడాకు చెందిన ఆఫిల్ ఐ ఫోన్ 7 పొరపాటున  సముద్రంలో పడిపోయింది.  ఎంత వెతికినా దొరకలేదు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆపిల్  ఐఫోన్ దొరికింది.

ఇంగ్లండ్‌లోని డోర్డల్‌ డోర్‌ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి  వెలుగును గమనించిన  ఆమె  దాని వద్దకు వెళ్లి  ఆ వస్తువును తీసింది. ఆపిల్ ఐఫోన్ గా గుర్తించి ఆమె షాకైంది. ఆ ఫోన్ నీళ్లలో తడిచినా కానీ బాగానే పనిచేస్తోందని ఆమె చెప్పింది. 

 48 గంటల పాటు ఆ ఐఫోన్‌ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్‌ మంచిగా పనిచేస్తుందని డిజిటైమ్స్ ప్రకటించింది.తనకు దొరికిన ఫోన్‌ను హార్సీ కెనడియన్ కు అందించింది. ఈ డివైజ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్