ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ 'గెలాక్సీ నోట్ 10 లైట్' ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ 'గెలాక్సీ నోట్ 10 లైట్' ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్ 10 కొనసాగింపుగా పలు మార్పులతో సంస్థ ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి తెచ్చింది.
ఈ నెల 22వ తేదీ నుంచి ఈ ఫోన్ల కోసం అడ్వాన్సు బుకింగ్స్ మొదలయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్ 6జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.
దీనిని 2.7 గిగాహట్జ్ ఎక్సినోస్ 9810 ఆక్టాకోర్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఇన్‌ఫినిటీ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో మార్కెట్లోకి తెచ్చినట్లు శామ్‌సంగ్ తెలిపింది. గెలాక్సీ నోట్ 10 లైట్ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సహా బ్లూ టూత్ తో అనుసంధానమయ్యే ప్రత్యేకమైన ఇన్ బిల్ట్ ఎస్ పెన్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతోపాటు 128 జీబీ అంతర్గత మెమొరీ (1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు) కేపాసిటీ దీని సొంతం. 6.7 అంగుళాల ఇన్ఫినిటీ-ఓ-డిస్ప్లే కల ఈ ఫోన్ ఎక్సినోస్ 9810 ప్రాసెసర్ చిప్సెట్ ఉన్నాయి.
వెనుకవైపు మూడు కెమెరాలు(12ఎంపీ, 12ఎంపీ, 12ఎంపీ), 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణలు కానున్నాయి. బ్యాక్ సైడ్ 12 మెగా పిక్సెల్ క్వాలిటీతో డ్యుయల్ పిక్సెల్ ఆటో ఫోకస్, వైడ్ యాంగిల్, టెలిఫొటో టెక్నాలజీతో మూడు రేర్ కెమెరాలు ఉన్నాయి.
వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఎస్ పెన్ ద్వారా ఫొటోలు, వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చని శాంసంగ్ తెలిపింది. ఎయిర్ కమాండ్ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల నుంచి 'గెలాక్సీ నోట్ 10 లైట్' ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
గెలాక్సీ నోట్ 10 లైట్ 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ గల ఫోన్ ధర రూ.38,999గా, 8 జీబీవిత్ 128 జీబీ అంతర్గత స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.40,999లకు లభిస్తుంది. ఆరా గ్లో, ఆరా బ్లాక్, ఆరా రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. పాత శామ్ సంగ్ ఫోన్ వినియోగదారులపై రూ.5000 ఆఫర్ అందిస్తోంది.