సామ్‌సంగ్ కంపెనీ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి గృహోపకరణాల కొనుగోళ్లపై ఖచ్చితమైన బహుమతులు అందిస్తోంది.ఈ ఆఫర్ 31 జనవరి 2020 వరకు అందుబాటులో ఉంటుంది.
కన్స్యూమర్ గృహోపకరణాల దిగ్గజం సామ్‌సంగ్ కంపెనీ రిపబ్లిక్ డే సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.దక్షిణ కొరియా సంస్థ సామ్‌సంగ్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్ల పై రకరకాల ఆఫర్లను అందిస్తోంది.
ఈ ఆఫర్ 31 జనవరి 2020 వరకు అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ ఆఫర్‌లో భాగంగా 15 శాతం క్యాష్ బ్యాక్, ఈజీ ఇఎంఐ పథకాలను కూడా అందిస్తోంది.క్యూఎల్‌ఇడి టివిలు, 4 కె యుహెచ్‌డి టివిలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు వంటి ఉత్పత్తుల కొనుగోలుపై సామ్‌సంగ్ ఖచ్చితమైన బహుమతులు అందిస్తోంది.
also read సమస్యలలో చిక్కుకున్న టెలికం రంగం...
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లపై ఫైనాన్స్ ఆఫర్లను కూడా ఇస్తుంది.ఆఫర్‌లో ఖచ్చితమైన బహుమతుల కింద సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 512 జిబి వేరియంట్ దిని ధర రూ. 76,900, గెలాక్సీ ఎ50ఎస్ 4జిబి ర్యామ్ వేరియంట్ దిని ధర రూ.19,999, గెలాక్సీ ఎం30 6జిబి ర్యామ్ వేరియంట్ దిని ధర రూ.16,999, గెలాక్సీ ఎ10ఎస్ 2జిబి ర్యామ్ వేరియంట్ దిని ధర రూ. 8,499, సామ్‌సంగ్ యు ఫ్లెక్స్ హెడ్‌ఫోన్స్ దిని ధర రూ. 3.799. వినియోగదారులు కోసం జీ5 యాప్ 30 రోజుల ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.
వినియోగదారులకు మై సామ్‌సంగ్ మై ఈఎంఐ ఎంచుకునే అవకాశం కూడా ఉంది. వినియోగదారుడు సెలెక్ట్ చేసుకున్నా ఉపకరణాలపై వారి బడ్జెట్ ప్రకారం ఈఎంఐ అలాగే డౌన్ పేమెంట్ ఎంచుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సామ్‌సంగ్ ఫ్లెక్సీ ఇఎంఐని కూడా అందిస్తోంది.
also read హువావే చీఫ్ ఆఫీసర్ విడుదలపై సంచలన తీర్పు...
కొనుగోలుదారులు వారు కొనుగోలు చేసే టి.వి స్క్రీన్ సైజ్ ఆధారంగా సౌకర్యవంతమైన నెలవారీ ఇఎంఐని పొందటానికి వీలు కల్పిస్తుంది.31 జనవరి 2020 ముందు కొనుగోలు చేసిన టి.వి మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ (1 సంవత్సర డిస్ ప్లే ప్యానెల్ + 1 సంవత్సర అదనపు వారంటీ) అలాగే ఉచిత 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ ఇన్ వారంటీని కూడా ఇవ్వనున్నారు.
సామ్‌సంగ్ 28 ఎల్ కన్వెన్షన్ మైక్రోవేవ్ ఓవెన్ లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఉచిత బోరోసిల్ కిట్‌ను కూడా అందిస్తోంది. సిరామిక్ ఎనామెల్ కావిటిపై 10 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఎంపిక చేసిన ఎయిర్ కండీషనర్లపై కూడా సామ్‌సంగ్ 2 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తున్నారు. కాబట్టి, మీరు పెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కొనాలనుకుంటే ఎదురు చూస్తున్నట్లయితే సామ్‌సంగ్ అందిస్తున్న ఈ ఆఫర్‌లను ఒకసారి పరిశీలించూకోవచ్చు.