స్యామ్సంగ్ గెలాక్సీ బుక్2 గో 5జి ప్రస్తుతం UKలో ప్రవేశపెట్టారు, జనవరి చివరిలో సేల్స్ మొదలవుతాయి.స్యామ్సంగ్ గెలాక్సీ బుక్2 గో 5జి 4జిబి ర్యామ్‌తో 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర GBP649 అంటే దాదాపు రూ. 64,900.
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్యామ్సంగ్ కొత్త ల్యాప్‌టాప్ గెలాక్సీ బుక్2 గో 5జిని లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ గెలాక్సీ బుక్ గో సిరీస్ కింద వస్తున్న కొత్త ల్యాప్‌టాప్. కొన్ని రోజుల క్రితం, కంపెనీ గెలాక్సీ బుక్2 గోని పరిచయం చేసింది. స్నాప్ డ్రాగన్ 7సి+ జెన్ 3 ప్రాసెసర్ గెలాక్సీ బుక్2 గో 5జిలో ఇచ్చారు. అంతేకాకుండా, ఈ ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల ఫుల్ హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే ఉంది.
స్యామ్సంగ్ గెలాక్సీ బుక్2 గో 5జి ధర
స్యామ్సంగ్ గెలాక్సీ బుక్2 గో 5జి ప్రస్తుతం UKలో ప్రవేశపెట్టారు, జనవరి చివరిలో సేల్స్ మొదలవుతాయి.స్యామ్సంగ్ గెలాక్సీ బుక్2 గో 5జి 4జిబి ర్యామ్‌తో 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర GBP649 అంటే దాదాపు రూ. 64,900. 8జిబి ర్యామ్ తో 256జిబి స్టోరేజ్ ధర GBP749 అంటే దాదాపు రూ. 74,900. ఈ ల్యాప్‌టాప్ భారతీయ మార్కెట్లో లాంచ్ పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
స్పెసిఫికేషన్లు
గెలాక్సీ బుక్2 గో 5జిలో eSIM+pSIM కనెక్టివిటీ ఉంది. అంతేకాకుండా విండోస్ 11 హోమ్ కూడా ఉంది. ల్యాప్‌టాప్‌లో 14-అంగుళాల ఫుల్ హెచ్‌డి టిఎఫ్‌టి, ఐపిఎస్ డిస్‌ప్లే ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7c+ Gen 3 ప్రాసెసర్ అందించారు. గ్రాఫిక్స్ కోసం, క్వల్ కం అడ్రినో GPU ఉంది. ల్యాప్‌టాప్ 8జిబి వరకు ర్యామ్ ఇంకా 256జిబి వరకు స్టోరేజ్ పొందుతుంది.
శాంసంగ్ హెచ్‌డి వెబ్‌క్యామ్ దీనిలో చూడవచ్చు. కనెక్టివిటీ కోసం, Wi-Fi 6E (802.11ax), బ్లూటూత్, 5G ENDC, యూఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇందులో నానో సిమ్ స్లాట్ ఉంది. 45W ఛార్జింగ్‌తో 42.3Wh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది.