లెనోవో టూ-ఇన్-వన్ ల్యాప్‌టాప్.. టచ్ స్క్రీన్, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో 15నిమిషాల్లో చార్జ్..

By asianet news telugu  |  First Published Jan 17, 2023, 4:46 PM IST

ఈ ల్యాప్‌టాప్ ప్రీమియం మొబైల్ అనుభవాన్ని అందించేలా రూపొందించబడిందని, దానితో పాటు ఇంటెల్ ఎవో సర్టిఫికేషన్ ఉందని కంపెనీ తెలిపింది. లెనోవో యోగా 9ఐ జెన్ 8ని ల్యాప్‌టాప్, స్టాండ్, టెంట్ లేదా టాబ్లెట్ వంటి నాలుగు మోడ్‌లలో ఉపయోగించవచ్చు.


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లెనోవో మంగళవారం కొత్త యోగా 9ఐ సిరీస్ కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌లతో పాటు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఈ సిరీస్‌ కింద లెనోవో యోగా 9ఐ జెన్ 8ని  ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ల్యాప్‌టాప్ ప్రీమియం మొబైల్ అనుభవాన్ని అందించేలా రూపొందించబడిందని, దానితో పాటు ఇంటెల్ ఎవో సర్టిఫికేషన్ ఉందని కంపెనీ తెలిపింది.

ఈ స్లిక్ టూ-ఇన్-వన్ ల్యాప్‌టాప్ 4K రిజల్యూషన్ ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్‌తో 14-అంగుళాల OLED ప్యూర్‌సైట్ టచ్‌స్క్రీన్‌ను పొందుతుంది. ల్యాప్‌టాప్‌లో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఉంది. లెనోవో యోగా 9ఐ జెన్ 8ని ల్యాప్‌టాప్, స్టాండ్, టెంట్ లేదా టాబ్లెట్ వంటి నాలుగు మోడ్‌లలో ఉపయోగించవచ్చు.

Latest Videos

లెనోవో యోగా 9ఐ జెన్ 8 ధర
భారతదేశంలో కొత్త లెనోవో యోగా 9ఐ మోడల్ ప్రారంభ ధర రూ.1,74,990. లెనోవో అఫిషియల్ సైట్ నుండి ల్యాప్‌టాప్ ని  ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. లెనోవో యోగా 9ఐ జెన్ 8ని జనవరి 29 నుండి లెనోవో  ఎక్స్ క్లూసివ్ స్టోర్ అండ్ అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. ల్యాప్‌టాప్ స్టార్మ్ గ్రే ఇంకా ఓట్‌మీల్ అనే రెండు వేరు వేర  కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. 

స్పెసిఫికేషన్‌లు
లెనోవో యోగా 9ఐ జెన్ 8 మోడల్ విండోస్ 11 ప్రొ ఆన్‌బోర్డ్‌ పొందుతుంది. ల్యాప్‌టాప్ 14-అంగుళాల OLED ప్యూర్‌సైట్ 4K స్క్రీన్‌తో వస్తుంది, 3,840x2,400 పిక్సెల్‌ రిజల్యూషన్, టచ్‌స్క్రీన్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. డిస్ ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌కు సపోర్ట్ అందించారు. లెనోవో ప్రీసిషన్ పెన్ 2 కూడా ల్యాప్‌టాప్‌తో బాక్స్‌లో వస్తుంది.  

లెనోవో యోగా 9ఐ జెన్ 8 స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో 2-మెగాపిక్సెల్ ఫుల్-HD అండ్ ఇన్‌ఫ్రారెడ్ వెబ్‌క్యామ్‌  లభిస్తుంది. ల్యాప్‌టాప్ కి నాలుగు బోవర్స్ & విల్కిన్స్ స్పీకర్లు అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో 360-డిగ్రీల తిరిగే సౌండ్‌బార్‌ను పొందుతుంది. ల్యాప్‌టాప్‌లో గ్లాస్ టచ్‌ప్యాడ్‌తో ఎడ్జ్-టు-ఎడ్జ్ కీబోర్డ్ ఉంది.

ల్యాప్‌టాప్‌తో గరిష్టంగా 16జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 1టి‌బి వరకు ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ఉంది. ల్యాప్‌టాప్‌లో 75 Wh బ్యాటరీ ఇచ్చారు, ఈ బ్యాటరీ 14 గంటల వరకు పూర్తి HD ప్లేబ్యాక్ టైం అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, రాపిడ్ ఛార్జ్ బూస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో 15 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటల బ్యాకప్ లభిస్తుంది. 

లెనోవో యోగా 9ఐ  జెన్ 8 కనెక్టివిటీ గురించి మాట్లాడితే  Wi-Fi 6E, బ్లూటూత్ v5.2 వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంది. రెండు యూ‌ఎస్‌బి టైప్-సి థండర్ బోల్ట్ 4.0 పోర్ట్‌లు, రెండు యూ‌ఎస్‌బి టైప్-సి 3.2 జెన్ 2 పోర్ట్‌లు, ఒక యూ‌ఎస్‌బి Type-A జెన్ 3.2 పోర్ట్, 3.55ఎం‌ఎం హెడ్‌ఫోన్/మైక్ కాంబో జాక్ ఉన్నాయి. ల్యాప్‌టాప్ బరువు దాదాపు 1.4 కిలోలు.

click me!