ఈరోజు జియో 5G సేవలను ప్రవేశపెట్టిన నగరాలలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కర్నూలు, అస్సాంలోని సిల్చార్, దావణగెరె, శివమొగ్గ, బీదర్, హోస్పేట్ ఇంకా కర్ణాటకలోని గడగ్-బెటగేరి, కేరళలోని మలప్పురం, పాలక్కాడ్, కొట్టాయం ఇంకా కన్నూర్, తమిళ్ నాడులోని తిరుప్పూర్, తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, ఉత్తరప్రదేశ్‌లో బరేలీ ఉన్నాయి.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ట్రూ 5జి నెట్‌వర్క్ ఉనికిని దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఈ వారం ప్రారంభంలో జియో 5G సేవలను బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పరిచయం చేసింది. అయితే ఈ రోజు కంపెనీ జియో ట్రూ 5G సేవను దేశవ్యాప్తంగా మరో 16 నగరాలకు పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈరోజు జియో 5G సేవలను ప్రవేశపెట్టిన నగరాలలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కర్నూలు, అస్సాంలోని సిల్చార్, దావణగెరె, శివమొగ్గ, బీదర్, హోస్పేట్ ఇంకా కర్ణాటకలోని గడగ్-బెటగేరి, కేరళలోని మలప్పురం, పాలక్కాడ్, కొట్టాయం ఇంకా కన్నూర్, తమిళ్ నాడులోని తిరుప్పూర్, తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, ఉత్తరప్రదేశ్‌లో బరేలీ ఉన్నాయి.
undefined
దీంతో జియో 5G సేవలు దేశవ్యాప్తంగా 130 నగరాలలో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన మొదటి ఇంకా ఏకైక ఆపరేటర్‌గా రిలయన్స్ జియో అవతరించింది. ఈ నగరాల్లోని జియో యూజర్లు 1 Gbps+ స్పీడ్ తో ఆన్ లిమిటెడ్ డేటాను పొందేందుకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈరోజు నుండి జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానించబడతారని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
“7 రాష్ట్రాల్లోని 16 అదనపు నగరాల్లో జియో ట్రూ 5G సేవలను అందుబాటులోకి తెచ్చినందుకు మేము గర్విస్తున్నాము, మొత్తంగా జియో ట్రూ 5G 134 నగరాలకు చేరుకుంది. 2023 కొత్త సంవత్సరంలో జియో ట్రూ 5G టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ ప్రయోజనాలను ప్రతి జియో యూజర్ ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మేము దేశవ్యాప్తంగా ట్రూ 5G రోల్‌అవుట్ స్పీడ్ అండ్ తీవ్రతను పెంచాము, ”అని జియో స్పోక్స్ పర్సన్ ఈ సందర్భంగా తెలిపారు.
ట్రూ 5Gని కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నగరాలు ముఖ్యమైన పర్యాటక ఇంకా వాణిజ్య గమ్యస్థానాలు అలాగే మన దేశంలోని ముఖ్య విద్యా కేంద్రాలు. జియో ట్రూ 5G సేవలను ప్రారంభించడంతో ఈ ప్రాంతంలోని యూజర్లు బెస్ట్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను పొందడమే కాకుండా ఇ-గవర్నెన్స్, విద్య, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, హెల్త్‌కేర్, వ్యవసాయం, IT రంగాలలో అనంతమైన వృద్ధి అవకాశాలను పొందుతారు అని టెల్కో పేర్కొంది.
జియో 4G సబ్‌స్క్రైబర్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ట్రూ 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. అయితే, సబ్‌స్క్రైబర్‌లు వారి ఫోన్ నంబర్‌లను కనీసం రూ.239తో రీఛార్జ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు అని కంపెనీ తెలిపింది.