శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) మొబైల్ నేడు (జూన్ 22న) లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను శాంసంగ్ (Samsung) టీజ్ చేసింది. ధర కూడా ఆకర్షణీయంగా బడ్జెట్ రేంజ్‌లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. డిస్‌ప్లే, బ్యాటరీ ఈ మొబైల్‌కు హైలైట్స్‌గా ఉండేలా కనిపిస్తున్నాయి.
బడ్జెట్ రేంజ్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు శాంసంగ్ (Samsung) సిద్ధమైంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) మొబైల్ బుధవారం (జూన్ 22) విడుదల కానుంది. తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లతో రానుంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను (Samsung Galaxy F13 Specifications) శాంసంగ్ టీజ్ చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 లిస్ట్ అయింది. ఎంతో సక్సెస్ అయిన గెలాక్సీ ఎఫ్12కు సక్సెసర్‌గా ఈ మొబైల్ వస్తోంది. 6000mAh బ్యాటరీతో గెలాక్సీ ఎఫ్13 రానుందని స్పష్టమైంది. Samsung Galaxy F13 లాంచ్, స్పెసిఫికేషన్లు, అంచనా ధర వివరాలు ఇవే.
Samsung Galaxy F13 లాంచ్ వివరాలు
undefined
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 మొబైల్ బుధవారం (జూన్ 22) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లభ్యం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ పేజ్ ద్వారా ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను శాంసంగ్ రివీల్ చేసింది.
Samsung Galaxy F13 స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13కు సంబంధించిన కొన్ని వివరాలను లాంచ్‌కు ముందే ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 6.6 ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లేతో తీసుకొస్తున్నట్టు ధ్రువీకరించింది. బెజిల్, నాచ్ సాధారణం కంటే తక్కువగా ఉండడంతో లుక్ పరంగానూ ఈ మొబైల్ స్టైలిష్‌గా అనిపిస్తోంది. Samsung Galaxy F13 మొబైల్‌లో 6000mAh బ్యాటరీ ఉంటుంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే చార్జర్‌ను ఇవ్వనుంది Samsung. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్ వేరియంట్ అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ వెల్లడించింది. వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.
Samsung Galaxy F13 డేటా స్విచ్చింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. పింక్, బ్లూ, గ్రీన్ కలర్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ వివరాలను శాంసంగ్ వెల్లడించింది. అయితే, Samsung Galaxy F13కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ మొబైల్‌లో ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది. వెనుక 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో లాంచ్ కానుంది. ఇక పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ధర (అంచనా)
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ధరకు సంబంధించిన చాలా లీక్‌లు, అంచనాలు వెల్లడవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.12,000 సమీపంలో ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ తర్వాత అధికారిక ధర వివరాలు తెలుస్తాయి.