రియల్‌మీ కంపెనీ Realme C30 అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఇది మంచి ఛాయిస్. ఇందులో ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
చైనీస్ టెక్ కంపెనీ రియల్‌మీ తాజాగా Realme C30 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. C31 తర్వాత కంపెనీ విడుదల చేసిన మరొక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ధర తక్కువగా ఉంటుంది. అందుకు తగినట్లుగా ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద స్క్రీన్, మంచి బ్యాటరీని కలిగి ఉండటం చెప్పుకోదగ్గ అంశాలు. ఇందులో ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఫోన్ నెమ్మదించే అవకాశం ఉంటుంది. అయితే రియల్‌మీ గో ఎడిషన్ అనే ప్రత్యేక UI ఇవ్వడం చేత కొన్ని తేలికపాటి యాప్‌లతో ప్రీ-లోడెడ్‌గా వస్తుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. అలాగే ఇందులో 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఇచ్చారు.
Realme C30 కేవలం 8.5 mm మందంతో సన్నగా ఉంది, ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉండి వెనుక చారల డిజైన్‌తో వచ్చింది. అలాగే దిగువన, ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్ ఇచ్చారు పక్కనే మైక్, 3.5mm ఆడియో జాక్ ఉంది.
ర్యామ్ ఆధారంగా ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. బ్యాంబూ గ్రీన్ , లేక్ బ్లూ అనే రెండు కలర్ ఛాయిస్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇందులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.
Realme C30 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 6.5 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే
- 2GB/ 3GB RAM, 32 GB స్టోరేజ్ సామర్థ్యం
- యునిసోక్ T612 1.82GHz ప్రాసెసర్
- వెనకవైపు 8 MP కెమెరా LED ఫ్లాష్; ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఫాస్ట్ ఛార్జర్
- కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.0, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ పోర్ట్ , 4G ఎల్‌టిఇ కనెక్టివిటీ ఉన్నాయి. Realme C30 ధర 2GB RAM వేరియంట్ కోసం రూ. 7,499. అలాగే 3GB RAM వేరియంట్ కోసం రూ. 8,299. జూన్ 27 నుంచి Realme.com, Flipkart, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి.