Redmi10 vs RealmeC35:రూ. 12వేలలోపు బెస్ట్ ఫోన్ ఏది, ఏ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి

By asianet news telugu  |  First Published Mar 19, 2022, 10:59 AM IST

ఇండియాలో స్మార్ట్ ఫోన్  మార్కెట్ రోజురోజుకి పెరిగిపోతుంది. అలాగే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ పరంగా బెస్ట్ ఫీచర్స్ ని అందిస్తూ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షితున్నాయి. అయితే 12 వేల లోపు ఉన్న బెస్ట్ ఫోన్స్ గురించి మీకోసం..


రెడ్‌మి ఇండియా ఇటీవలే రెడ్‌మి 10ని భారతదేశంలో లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ కొత్త ఫోన్ రెడ్‌మి9కి అప్‌గ్రేడ్ వెర్షన్, అయితే  రెడ్‌మి 10 భారతీయ వేరియంట్ గ్లోబల్ వేరియంట్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. రెడ్‌మి 10లో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఇచ్చారు. అంతేకాకుండా ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. రెడ్‌మి 10కి పోటీగా భారతీయ మార్కెట్లో రియల్ మీ సి35తో బలంగా ఉంది. రియల్ మీ సి35 ప్రారంభ ధర రూ. 11,999, రెడ్‌మి 10 ప్రారంభ ధర రూ. 10,999, కాబట్టి మీరు ఈ రెండు ఫోన్‌లలో ఏది బెస్ట్ తెలుసుకుందాం?

రెడ్‌మి10 vs రియల్ మీ సి35: ధర
రెడ్‌మి 10  4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ ధర రూ 10,999.6 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,999గా ఉంది. కరేబియన్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, పసిఫిక్ బ్లూ కలర్‌లలో ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
రియల్ మీ సి35  4 జి‌బి ర్యామ్‌తో 64జి‌బి స్టోరేజ్ ధర రూ 11,999.4 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,999గా ఉంది. రియల్ మీ సి35ని గ్లోయింగ్ బ్లాక్ అండ్ గ్లోయింగ్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

undefined

ప్రాసెసర్ అండ్ డిస్ ప్లే
రెడ్‌మి 10లో Android 11 ఆధారిత MIUI 13 లభిస్తుంది. అంతేకాకుండా 400 నిట్‌ల బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే పై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. రెడ్‌మి 10 స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Adreno 610 GPU, గరిష్టంగా 6GB LPDDR4X ర్యామ్ తో 128జి‌బి  వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో 2జి‌బి వర్చువల్ ర్యామ్ కూడా ఇచ్చారు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ UI R ఎడిషన్ రియల్ మీ సి35లో ఇచ్చారు. ఫోన్ లో 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే అందించారు. ఫోన్‌లో Unisoc T616 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జి‌బి LPDDR4X ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. డిస్‌ప్లే కర్వ్ గా ఉన్నప్పటికీ ఫోన్ సైడ్‌లు ఐఫోన్ 13 సిరీస్ లాగా ఫ్లాట్‌గా ఉంటాయి.

కెమెరా
ఈ రియల్ మీ ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు, ఎపర్చరు f/1.8, రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో అండ్ మూడవ  లెన్స్ 2-మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్, సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీని ఎపర్చరు f / 2.0. 
కెమెరా గురించి మాట్లాడితే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.8 ఉంది. రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాతో పాటు ఫ్లాష్ లైట్ ఇచ్చారు. రెడ్‌మీ 10లో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, రెడ్‌మి 10 బ్యాక్ ప్యానెల్‌లో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంది. రెడ్‌మి 10 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, అయితే బాక్స్‌లో 10W ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రియల్ మీ సి35  ఫోన్‌లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, టైప్-C పోర్ట్, కనెక్టివిటీ కోసం జి‌పి‌ఎస్ ఉన్నాయి. ఫోన్ బరువు 189 గ్రాములు.  18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.

click me!