Firefox Internet Browser: ఆ యూజ‌ర్ల‌కు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

By team telugu  |  First Published Mar 18, 2022, 12:30 PM IST

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో సాంకేతిక‌ లోపం కారణంగా Mozilla ప్రొడక్టుల్లో అనేక భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో ఈ బ్రౌజ‌ర్ వినియోగించే వారిని వెంట‌నే యాప్‌ను అప్ డేట్ చేయాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తుంది. 
 


మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లకు హెచ్చరిక.. మీ కంప్యూటర్‌లో మొజిల్లా ఫైర్‌ఫాక్స్ Browser వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. భారత ప్రభుత్వం ఈ Firefox బ్రౌజర్ వినియోగించే యూజర్లను హెచ్చరిస్తోంది. ప్రస్తుత మొజిల్లా (Mozilla Firefox) ప్రొడక్టుల్లో అనేక భద్రతా లోపాలను ఉన్నాయని కనుగొన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. స్పూఫింగ్ అటాక్స్, ఆర్టిటరీ కోడ్‌ ద్వారా యూజర్ల సమ్మతి లేకుండానే వారి విలువైన వ్యక్తిగత డేటా హ్యాకర్లు తస్కరించే రిస్క్ ఉందని CERT-In పేర్కొంది. లేటెస్టుగా Mozilla Firefox 98 అప్‌డేట్‌కు రాకముందు.. అన్ని Mozilla Firefox వెర్షన్‌లు ఈ భద్రతా లోపాలతో ప్రభావితమైనట్లు భద్రతా ఏజెన్సీ వెల్లడించింది. అదనంగా, 91.7 వెర్షన్‌కి ముందు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ESR వెర్షన్‌లు 91.7కి ముందున్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ థండర్‌బర్డ్ వెర్షన్‌లు సైతం ఇలాంటి భద్రతా లోపాలను ఎదుర్కొంటున్నాయి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ‘ఉచిత ఇన్-టెక్స్ట్ రీఫ్లోలు (use-after-free in-text reflows), థ్రెడ్ షట్‌డౌన్, యాడ్-ఆన్ సిగ్నేచర్ వెరిఫై సమయంలో టైమ్-ఆఫ్-చెక్ టైమ్-యూజ్ బగ్, శాండ్‌బాక్స్ చేసిన iframe కంటెంట్‌లను నియంత్రిస్తోంది. ఈ లోపం కారణంగా Mozilla ప్రొడక్టుల్లో అనేక భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సాధారణంగా బ్రౌజర్లలో పాప్ అప్ మెసేజ్‌లకు అనుమతించరు. స్క్రిప్ట్‌లు, బ్రౌజర్ ఇంజిన్‌లోని మెమరీ సేఫ్టీ బగ్‌లు, టెంపరరీ ఫైల్‌లను /tmpకి డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇతర యూజర్లు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. పూర్తి స్క్రీన్ మోడ్‌ను ఉపయోగించి టెక్స్ట్ బ్రౌజర్ విండో స్పూఫ్‌పై సైడ్-ఛానల్ అటాక్స్ దాడి జరిగే ముప్పు ఉందని CERT -in వెల్లడించింది.

Latest Videos

undefined

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లోని భద్రతా లోపాలను హ్యాకర్లు ఎలా ఉపయోగించే ముప్పు ఉందో CERT-In అధికారిక ప్రకటనలో వివరణ ఇచ్చింది. హ్యాకర్లు.. ప్రత్యేకంగా రిమోట్ అటాకర్ రూపొందించిన లింక్ లేదా వెబ్‌సైట్‌ను సందర్శించేలా ప్రేరేపిస్తారు. యూజర్లు పొరపాటున తెలిసో తెలియకో ఆయా లింకులను క్లిక్ చేస్తే తెలియకుండానే హ్యాకర్ల చేతుల్లోకి యూజర్ల డేటా వెళ్లిపోతోంది. CERT-In ప్రభావిత యూజర్లు వెంటనే తాము వాడే Mozilla Firefox బ్రౌజర్‌ అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే పలు వెర్షన్లలో Mozilla Firefox, Firefox 98, Firefox ESR 91.7, Thunderbird 91.7కు వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి సూచిస్తోంది. మీరు వాడే Mozilla Firefox బ్రౌజర్‌ కొత్తగా అప్‌గ్రేడ్ చేయాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

Mozilla Firefox Alert : బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలంటే? :
- Mozilla Firefox బ్రౌజర్ ఓపెన్ చేయండి.

- Firefox టూల్‌బార్ కుడి వైపున ఉన్న Menu బటన్‌ను క్లిక్ చేయండి.

- ఇక్కడ మీరు Help ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత Firefox About ఆప్షన్ ఎంచుకోండి.

- Firefox Updates కోసం Search చేస్తుంది.

- అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. బ్రౌజర్ ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.

- డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత Firefoxని Restart to Update క్లిక్ చేయండి.

- మీ Firefox బ్రౌజర్‌ని ఇప్పటివరకూ అప్‌గ్రేడ్ చేయలేదంటే వెంటనే చేయండి.

click me!