చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి విడుదల చేసిన ఎక్స్2 ఫోన్ నేటి నుంచి ఆసక్తి గల కస్టమర్లకు ఆన్‌లైన్‌లో లభించనున్నది. రూ.16,999లకే దీని ధర మొదలవుతుంది.తొందరలోనే ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్లు రియల్ మీ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ విపణిలోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ‘రియల్ మీ ఎక్స్2’ను తీసుకువచ్చింది. రూ.16,999 నుంచి దీని ప్రారంభ ధర మొదలవుతుంది. ఈ నెల 20వ తేదీ నుంచి రియల్ మీతోపాటు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. తొందరలోనే ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి తేనున్నట్లు రియల్ మీ ప్రకటించింది.
also read అమెజాన్ ఇండియాలో ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’
undefined
రియల్ మీ ఎక్స్ టీ అప్ గ్రేడ్ వర్షన్ మోడల్ ఫోన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకు వచ్చింది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభించనున్నది. 4జీబీ విత్ 64 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.16,999గానూ, 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ ధర రూ.18,999గానూ, 8 జీబీ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.19,999గానూ నిర్ణయించామని తెలిపింది.
పెర్ల్ బ్లూ, పెర్ల్ గ్రీన్, పెర్ల్ వైట్ మూడు రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లభించనున్నది. భారత విపణిలో ప్రవేశపెట్టిన సందర్భంగా సంస్థ పలు ఆఫర్లను ప్రకటించింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు సభ్యులకు రూ.1500 ఇన్ స్టంట్ డిస్కౌంట్, మొబీ క్విక్ యాప్ ద్వారా రూ.1500, జియో వినియోగదారులకు రూ.11,500 విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించింది రియల్ మీ.
also read అమెరికాలో కేసు.. కోర్టు బయటే పరిష్కారానికి ఇన్ఫోసిస్ రెడీ
ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ రియల్ మీ ఎక్స్ 2 ఫోన్‌కు 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ టచ్ స్క్రీన్, 32 ఎంపీ ఫ్రంట్, 64 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730 ఎస్వోసీ ప్రాసెసర్, 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చామని తెలిపింది. ఇందులోనూ బ్యాక్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ డిస్ ప్లే ఉంది.