ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త C సిరీస్ ఫోన్ వస్తోంది. ఈ నెల 16న గ్లోబల్ ఈవెంట్‌లో C40 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. Poco C40 స్మార్ట్ ఫోన్ సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త C సిరీస్ ఫోన్ వస్తోంది. ఈ నెల 16న గ్లోబల్ ఈవెంట్‌లో C40 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. Poco C40 స్మార్ట్ ఫోన్ సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. C40 Poco స్మార్ట్ ఫోన్ C-సిరీస్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఆరు నెలల తర్వాత ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. C-సిరీస్ ఫోన్లలో ఇదే చివరిది. ఆన్‌లైన్-మాత్రమే ఈవెంట్ నిర్వహించనున్నట్టు Poco తెలిపింది. భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. Poco నుంచి రాబోయే ఈ కొత్త ఫోన్ సరికొత్త ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. Poco C40లో స్వ్వైర్ షేప్ కెమెరాతో పాటు దాని కిందనే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.
కెమెరా చుట్టుపక్కల భిన్నమైన రంగును ఉపయోగించే అవకాశం ఉంది. అక్కడే Poco లోగోను ఉంచనుంది. Poco సిగ్నేచర్ Poco ఎల్లో డిజైన్‌తో C40 రిలీజ్ చేస్తుంది. ఈ డిజైన్ ఖచ్చితంగా ప్రత్యేకంగా కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో అనేక మార్కెట్లలో లాంచ్ అయిన Redmi 10C మాదిరిగానే ఉంది. భారత మార్కెట్లో రిలీజ్ అయిన Redmi 10 స్మార్ట్ ఫోన్ పోలి ఉంటుంది. Poco C40 డిజైన్‌లో Poco ఎల్లో కలర్ ఆప్షన్ మాత్రమే. C40 ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంపై ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. 6000mAh ‘హై-కెపాసిటీ’ బ్యాటరీతో వస్తుందని ఈ పోకో ఫోన్ వస్తుందని తెలిపింది. Poco C40లో 6.71-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని Poco ధృవీకరించింది. Poco ఫోన్‌లో ఇదే అతిపెద్ద డిస్‌ప్లే కూడా. ఇతర స్పెసిఫికేషన్‌లు. ఫీచర్లు ఏమి ఉన్నాయో వెల్లడించలేదు.
భారత మార్కెట్లో Poco చివరి C-సిరీస్ ఫోన్ C31 మాత్రమే.. స్వ్కైర్ షేప్ కెమెరా బంప్ వెనుకవైపు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సేమ్ డిజైన్‌ను కలిగి ఉంది. Poco C31 5000mAh బ్యాటరీతో వస్తుంది. C40 ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చినప్పుడు Poco C31 4GB వరకు RAMతో MediaTek Helio G35 SoCని ఉపయోగిస్తుంది. HD రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. వెనుకవైపు, LED ఫ్లాష్‌తో కూడిన 13-MP ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి.