240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌.. ఈ ఫోన్ అతితక్కువ టైంలోనే ఛార్జ్ అవుతుంది.. ఎలా అంటే ?

By asianet news teluguFirst Published Jan 6, 2023, 8:33 PM IST
Highlights

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతోంది. ఏది ఏమైనప్పటికీ రియల్ మీ ఇన్నోవేషన్స్ కి ప్రసిద్ధి చెందింది.  కంపెనీ ప్రకటన ప్రకారం, ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. 

గత రెండేళ్లుగా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో చాలా పోటీ నెలకొంది. అన్ని టెక్నాలజీ కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్‌తో గాడ్జెట్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఫోన్లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి, ఇవి 20 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయబడతాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతోంది. ఏది ఏమైనప్పటికీ రియల్ మీ ఇన్నోవేషన్స్ కి ప్రసిద్ధి చెందింది. రియల్ మీ నుండి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్ జి‌టి నియో 5ని 240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందించవచ్చు.

240W  ఛార్జింగ్ టెక్నాలజీ 85 డిగ్రీల ఉష్ణోగ్రత ఇంకా 85% తేమలో కూడా పని చేస్తుంది. రియల్ మీ జి‌టి నియో 3లో 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతానికి వేగవంతమైన ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్. రియల్ మీ జి‌టి నియో 3లో 5000mAh బ్యాటరీ ఉంది, దీనికి 80W ఛార్జింగ్ ఇచ్చారు.

రియల్ మీ జి‌టి నియో  5
ఈ రియల్ మీ  ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. 240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే. రియల్ మీ జి‌టి నియో  5లో 13 ఇన్‌బిల్ట్ టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. ఇది కాకుండా, PS3 ఫైర్ ప్రొటెక్షన్ డిజైన్  ఉంది. ఈ 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ డ్యూయల్ GaN మినీ ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది. 

దీనితో 21AWG సన్నగా ఉండే 12A ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే చూడవచ్చు, దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ఫోన్‌లో అందించారు.

click me!