Mobiles, Mobile Reviews: రియల్‌మీ ఇండియాలో రియల్ మీ సి31 (Realme C31)ని గత వారం లాంచ్ చేసింది అయితే నేటి నుండి అంటే ఏప్రిల్ 6న రియల్ మీ సి31 ఫస్ట్ సెల్ వచ్చేసింది.
ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ అభివృద్ది సంస్థ రియల్‌మీ ఇండియాలో రియల్‌మీ సి31 (Realme C31)ని గత వారం ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈరోజు అనగా ఏప్రిల్ 6న Realme C31 ఫస్ట్ సేల్ అందుబాటులోకి వచ్చింది. 6.5-అంగుళాల ఎల్‌సిడి డిస్ ప్లే రియల్‌మీ సి31తో అందించారు. అంతేకాకుండా మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, Unisoc T612 ప్రాసెసర్, 4జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
రియల్‌మీ సి31 ధర
రియల్‌మీ సి31 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజ్ ధర రూ. 8,999. 4 జీబీ ర్యామ్‌తో కూడిన 64 జీబీ స్టోరేజ్ ధర రూ.9,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్ నుండి డార్క్ గ్రీన్ ఇంకా లైట్ సిల్వర్ కలర్‌లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ సి31 స్పెసిఫికేషన్‌లు
రియల్‌మీ సి31లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రియల్‌మీ UI Rఎడిషన్ లభిస్తుంది. 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే అందించారు. డిస్‌ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతం ఉంటుంది. ఫోన్‌లో 12nm Unisoc T612 ప్రాసెసర్, 4జిబి వరకు ర్యామ్, 64 జిబి వరకు స్టోరేజ్ ఉంది.
Realme C31లో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్‌లు. దీనితో 4x డిజిటల్ జూమ్ ఉంది. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో అండ్ మూడవ లెన్స్ మోనోక్రోమ్, ముందు భాగంలో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
కనెక్టివిటీ కోసం రియల్‌మీ C31లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 197 గ్రాములు.