ఒక వార్తా పత్రిక దీనిని మొదట నివేదించింది, జేమ్స్ బాండ్ చలనచిత్రంలో లాగా కనిపించే ఈ షూ సాధారణ లెదర్ లోఫర్‌ల కనిపిస్తుంది. అయితే షు కింద కొన్ని అద్భుతమైన టెక్నాలజి లోడ్ చేయబడింది.
అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన అంకురిత్ కర్మాకర్ అనే 9వ తరగతి విద్యార్ధి ఒక కొత్త టెక్నాలజి రూపొందించాడు. అదేంటంటే దృష్టిలోపం ఉన్నవారి కోసం నడిచే దారిలో అడ్డంకులను నివారించడంలో సహాయపడే ప్రత్యేక స్మార్ట్ షూను అభివృద్ధి చేశాడు.
ఒక వార్తా పత్రిక దీనిని మొదట నివేదించింది, జేమ్స్ బాండ్ చలనచిత్రంలో లాగా కనిపించే ఈ షూ సాధారణ లెదర్ లోఫర్‌ల కనిపిస్తుంది. అయితే షు కింద కొన్ని అద్భుతమైన టెక్నాలజి లోడ్ చేయబడింది.
undefined
ఈ షు ముందు భాగంలో అడ్డంకులను గుర్తించే సెన్సార్లు ఉన్నాయి. ఏదైనా అడ్డంకిని గుర్తించిన తర్వాత అడ్డంకి గురించి షు ధరించిన వ్యక్తిని అప్రమత్తం చేస్తూ షూ గట్టిగా బజర్‌ని మొగిస్తుంది.
బారెల్ కనెక్టర్‌ని ఉపయోగించి బ్యాటరీకి కనెక్ట్ చేసిన సెన్సార్‌తో షూ కింద భాగంలో అతికించబడిన చిన్న బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది.
అంకురిత్ ఒక ప్రకటనలో "అంధులు నడిచే మార్గంలో ఏదైనా అడ్డంకి ఉంటే షూలోని సెన్సార్ దానిని గుర్తించి బజర్ హెచ్చరికను ఇస్తుంది. బజర్ మోగినప్పుడు, దృష్టి లోపం ఉన్న వ్యక్తి దానిని వినగలడు అలాగే అప్రమత్తం అవుతాడు" అని వివరించాడు.
తాను పెద్దయ్యాక శాస్త్రవేత్త కావాలని మానవాళికి జీవితాలను సులభతరం చేసేందుకు ఇలాంటి మరిన్ని సాంకేతిక పరికరాలను రూపొందించాలని ఆకాంక్షిస్తున్నట్లు అంకురిత్ వెల్లడించాడు.
"నేను అంధుల కోసం ఈ స్మార్ట్ షూని తయారు చేసాను. శాస్త్రవేత్త కావడమే నా లక్ష్యం. ప్రజలకు సహాయపడే & వారి జీవితాన్ని సులభతరం చేసే మరిన్ని పనులు చేస్తాను," అని అన్నారు.