కరోనా ఎఫెక్ట్: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక ‘వర్క్ ఫ్రం హోం’

By narsimha lode  |  First Published Apr 26, 2020, 2:07 PM IST

 కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌‌డౌన్‌‌ వల్ల వివిధ కంపెనీల ఉద్యోగులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కానీ ఐటీ సర్వీసుల కంపెనీ - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)‌ మాత్రం తన కంపెనీలో పనిచేసే వారికి తీపి కబురు అందించింది. 


న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌‌డౌన్‌‌ వల్ల వివిధ కంపెనీల ఉద్యోగులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కానీ ఐటీ సర్వీసుల కంపెనీ - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)‌ మాత్రం తన కంపెనీలో పనిచేసే వారికి తీపి కబురు అందించింది. 

ఇక నుంచి 2.60 లక్షల మంది ఉద్యోగులకు వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ ఆప్షన్‌‌ ఇవ్వనుంది. 20 ఏళ్ల నాటి ఆపరేటింగ్‌‌ మోడల్‌‌ను పూర్తిగా మార్చి ఆఫీసులను తక్కువ స్టాఫ్‌‌తో నడపాలని టీసీఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటంతో 90 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తూ ఎస్బీడబ్ల్యూఎస్ వేదికను వాడుకుంటున్నారు.

Latest Videos

ప్రస్తుతం టీసీఎస్‌‌కు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఇప్పుడు 20 శాతం మంది వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానంలో పనిచేస్తుండగా, 2025 నాటికి వీరి సంఖ్యను 75 శాతానికి పెంచాలని టీసీఎస్‌‌ కోరుకుంటున్నది. 

అంటే వచ్చే ఐదేళ్లలో టీసీఎస్ సంస్థలో 2.62 లక్షల మంది ఇంటి నుంచే పనిచేస్తారు. ఆఫీసులకు 25 శాతానికి మించి ఉద్యోగులు రావాల్సిన అవసరం లేదని, మిగిలిన వాళ్లంతా ఇంటి నుంచే పనిచేయవచ్చని టీసీఎస్ చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌ సుబ్రమణియం అన్నారు.

లాక్‌‌డౌన్‌‌ తరువాత ఈ కంపెనీ తన మొత్తం ఉద్యోగులతో సెక్యూర్‌‌ బోర్డర్‌‌లెస్‌‌ వర్క్‌‌ స్పేస్‌‌ (ఎస్‌‌బీడబ్ల్యూఎస్‌‌) విధానంలో పనిచేయించింది. దీనివల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఈ విధానంలో ఇప్పటికే 35 వేల సమావేశాలు నిర్వహించారు. 40,600 కాల్స్‌‌, 340 లక్షల మెసేజ్‌‌లు వెళ్లాయని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేశ్‌‌ గోపీనాథన్‌‌ చెప్పారు. 

అందుకే దశల వారీగా 75 శాతం మంది ఉద్యోగులను వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానంలో పనిచేయించాలని టీసీఎస్ నిర్ణయించింది. ఇండియాలో టీసీఎసే అతిపెద్ద ఐటీ కంపెనీ కాబట్టి మిగతా ఐటీ కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.

విపరీతమైన ట్రాఫిక్‌‌ ఉండే మెట్రో నగరాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని రవి గజేంద్రన్‌‌ అనే ప్రొఫెసర్‌‌ అన్నారు. టీసీఎస్‌‌ విధానాన్ని ఇన్ఫోసిస్‌‌, విప్రో వంటివి అనుసరించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానానికి మారినప్పటికీ తమ ప్రాజెక్టులన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయని, ఎలాంటి సమస్యలూ లేవని టీసీఎస్ చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌ సుబ్రమణియం వివరించారు. ఈ విషయమై అనరాక్ కన్సల్టింగ్‌‌ ప్రతినిధి ఆశుతోష్‌‌ లిమయే మాట్లాడుతూ ఎంట్రీ, మిడిల్‌‌ లెవెల్‌‌ ఉద్యోగుల ఇళ్లలో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్‌‌, హార్డ్‌‌వేర్‌‌ వంటి ఎక్విప్‌‌మెంట్లు ఉండకపోవచ్చన్నారు. 

also read:జూమ్‌కు ఫేస్‌బుక్ ఆల్టర్నేటివ్ యాప్ ‘మెసేంజర్’

నెట్‌‌వర్క్‌‌ సమస్యలు కూడా రావొచ్చని అనరాక్ కన్సల్టింగ్‌‌ ప్రతినిధి ఆశుతోష్‌‌ లిమయే అన్నారు. మనదేశంలో ఐటీ రంగంలో మౌలిక వసతులు బాగానే పెరిగాయని, ఇది మరింత డెవెలప్‌‌కావాల్సి ఉందని చెప్పారు.

టీసీఎస్ సీఓఓ ఎన్జీ సుబ్రమణ్యం మాట్లాడుతూ 100 శాతం పనితీరును రాబట్టాలంటే కార్యాలయాల్లో 25 శాతానికన్నా ఎక్కువ ఉద్యోగులు అవసరం అని తాము విశ్వసించడం లేదన్నారు. కొత్త విధానంలో ప్రతి ఉద్యోగి కేవలం 25 శాతమే కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని టీంలకు ఇదే వర్తిస్తుందని చెప్పారు. 

click me!