LeTV Y1 Pro: ఐఫోన్ లాంటి ఫోన్.. ధ‌ర ఎంతో తెలిస్తే షాకే..!

By team telugu  |  First Published Jun 6, 2022, 4:05 PM IST

సరికొత్త స్మార్ట్‌ఫోన్ LeTV Y1 Pro ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ చూడటానికి అచ్ఛంగా iPhone 13లాగే ఉంటుంది. ధర మాత్రం చాలా తక్కువే ఉంది. వివరాలు చూడండి.
 


చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ LeTV తాజాగా LeTV Y1 Pro అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది అచ్ఛంగా ఆపిల్ ఐఫోన్ 13ను పోలి ఉంటుంది. కానీ ధర మాత్రం చాలా తక్కువ ఉంది. ఎంతంటే ఒక్క ఐఫోన్ 13తో కనీసం ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌లను 10 కొనుగోలు చేయవచ్చు. అవాక్కయ్యారు కదా. అట్లుంటది మరి LeTV Y1 Pro అనే స్మార్ట్‌ఫోన్‌ అంటే.

ప్రస్తుతం ఐఫోన్ 13 ఖరీదు రూ. 70 వేలు మొదలుకొని, రూ 1.30 లక్షల వరకు ఉంది. అదే LeTV Y1 Pro అయితే చైనాలో 499CNYగా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5,800. ఈ లెక్కన ఐఫోన్ 13కి దాని డూప్ అయిన ఈ ఫోన్‌కు ధరలో ఎంత తేడానో అర్థం చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా మరో చైనీస్ కంపెనీ ఫోన్ జియోనీ జీ13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కూడా ఐఫోన్13 లాగే ఉంది. అది కూడా సుమారు రూ. 6 వేల ధరలో లభిస్తుంది. ఇలా చైనీస్ కంపెనీలు ఐఫోన్ మోడళ్లను అడ్డంగా కాపీ కొడుతూ, ఆపై వాటిని అతి తక్కువ ధరలకే అమ్ముతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Latest Videos

LeTV Y1 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..!

- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే

- 4GB RAM,  32GB/64GB/128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

- యునిసోక్ T310 ప్రాసెసర్

- వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌

- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

- 4000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్.. ఇంకా USB టైప్-C పోర్ట్, కోసం 3.5mm జాక్ ఉన్నాయి. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదు. బదులుగా ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది.

స్టోరేజ్ ఆధారంగా 4 వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్ 4GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగింది సుమారు రూ. 10,500 ధరను కలిగి ఉంది. ఈ ఫోన్ వచ్చే నెలలో ఇతర మార్కెట్లలో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

click me!