పిల్లలుగా మారిన ప్రపంచ నేతలు.. ఏఐ రూపొందించిన క్యూట్ వీడియో వైరల్..

By Ashok kumar SandraFirst Published Apr 22, 2024, 3:10 PM IST
Highlights

 నిపుణులు ఈ టెక్నాలజీని  తప్పుడు ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం మానవులు చేస్తున్న ఎన్నో  పనులను ప్రమాదానికి గురి చేస్తుందని నిపుణులు భయపడుతున్నారు. 
 

AI అని పిలువబడే ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్  టెక్నాలజీ  నేటి అత్యాధునిక శాస్త్రీయ ప్రపంచంలో ఎన్నో  చిక్కులతో ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్‌ని మనిషిలా ఆలోచించేలా లేదా మనిషిలాగా ప్రవర్తించేలా చేస్తుంది. అయితే ఈ AI టెక్నాలజీ మనుషుల కంటే శక్తివంతమైనది. ఈ AI టెక్నాలజీలను అభివృద్ధి చేసిన మానవులకు కూడా ఇవి  చేయలేనివి ఏం లేవని  చెప్పబడింది. కాబట్టి రోజులు గడిచేకొద్దీ మరిన్ని ఇన్‌పుట్‌లను పొందడంతో AI స్వయంగా మెరుగుపడుతుంది. 

 నిపుణులు ఈ టెక్నాలజీని  తప్పుడు ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం మానవులు చేస్తున్న ఎన్నో  పనులను ప్రమాదానికి గురి చేస్తుందని నిపుణులు భయపడుతున్నారు. 

ఇది కాకుండా AI రూపొందించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అలాగే, AI టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ప్రపంచ నాయకుల చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు పలువురితో కూడిన ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 

 

World leaders as babies, according to AI

[📹 Planet AI]pic.twitter.com/jT6Gbk9Z4y

— Massimo (@Rainmaker1973)

ఈ AI వీడియో X వెబ్‌సైట్ అకౌంట్  Massimoలో షేర్  చేయబడింది. ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్  ఇంకా  లైక్‌లు వచ్చాయి. 

click me!