గూగుల్ పే వాడుతున్నారా.. లక్ష వరకు ఈజీగా లోన్.. ఇలా చేస్తే చాలు..

By Ashok kumar Sandra  |  First Published Apr 22, 2024, 1:20 PM IST

భారతదేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్  సిస్టం చాలా ప్రజాదరణ పొందింది. ఇందులో గూగుల్ జీ-పే ముందుంది. ఇప్పుడు  చిన్న వ్యాపారవేత్తలు GPay ద్వారా లోన్  పొందేందుకు Google సాచెట్ లోన్స్  అనే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
 


 ప్రతిరోజు వ్యాపార అవసరాల కోసం చిన్న వ్యాపారానికి చిన్న మొత్తాలు అవసరం కావచ్చు. దీని కోసం బ్యాంకులకు వెళ్లి లోన్  తీసుకోలేరు. అందువల్ల, గూగుల్ ఇండియా  ఇన్స్టంట్  బిజినెస్ అవసరాలను తీర్చడానికి  లోన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

భారతదేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్  సిస్టం చాలా ప్రజాదరణ పొందింది. ఇందులో గూగుల్ జీ-పే ముందుంది. ఇప్పుడు  చిన్న వ్యాపారవేత్తలు GPay ద్వారా లోన్  పొందేందుకు Google సాచెట్ లోన్స్  అనే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.

Latest Videos

undefined

సాచెట్ లోన్స్  అనేది సాధారణంగా రూ.10,000 నుండి రూ. 1 లక్ష వరకు చిన్న మొత్తం లోన్  సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిని  7 రోజుల నుండి 12 నెలల వరకు తిరిగి చెల్లింవచ్చు. దీని ప్రకారం, Google Pay Sachet లోన్‌ల ద్వారా మీరు రూ.15,000 నుండి లోన్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని ప్రతినెలా  EMIగా తిరిగి చెల్లించవచ్చు.

GPay సాచెట్ లోన్‌ల కోసం అర్హత ప్రమాణాలు ఏమిటి?

GPay Sachet లోన్‌లను పొందాలనుకునే వారు తప్పనిసరిగా కనీసం 18 సంవత్సరాల వయస్సు  ఉండాలి. మొబైల్ నంబర్, ఆధార్, బ్యాంక్ కార్డ్ తదితర వివరాలు తప్పనిసరి. అయితే లోన్ తీసుకోవాలనుకునే వారి సివిల్ స్కోర్ 750 కంటే తక్కువ ఉండకూడదు.

ఎలా పొందవచ్చు?

ముందుగా మీరు Google Pay Business యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ వ్యాపారం కోసం Google Pay యాప్‌లోని క్రెడిట్ విభాగానికి వెళ్లి ఆఫర్స్  అప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు అవసరమైన లోన్ మొత్తాన్ని ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. తర్వాత, మీరు google pay ఇన్‌స్టాల్ చేయబడిన బ్యాంక్ సైట్‌కి వెళ్లి KYCతో సహా కొన్ని వివరాలను ఎంటర్ చేయడం ద్వారా లోన్ పొందుతారు.

click me!