బెంగళూరులో ఉన్న ఫోన్‌పే ప్రధాన కార్యాలయం గత ఏడాది నవంబర్‌లో ఒక బిలియన్ లావాదేవీల మైలురాయిని దాటిందని అలాగే కేవలం ఒక సంవత్సరంలోనే ఐదు రెట్ల అభివృద్ధి పెరిగింది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫోన్‌పే యాప్ దేశంలో 175 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 150 మిలియన్లకు పైగా బ్యాంక్ ఖాతాలు ఫోన్‌పే యాప్ ద్వారా లింక్ చేయబడ్డాయి.డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ఫోన్‌పే యాప్ ఇప్పటివరకు ఫోన్‌పే యాప్ ద్వారా ఇప్పటికరకు ఐదు బిలియన్ల లావాదేవీలను దాటిందని ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది.
also read షియోమి కొత్త ఫిట్ నెస్ బ్యాండ్...ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు...
undefined
బెంగళూరులో ఉన్న ఫోన్‌పే ప్రధాన కార్యాలయం గత ఏడాది నవంబర్‌లో ఒక బిలియన్ లావాదేవీల మైలురాయిని దాటిందని అలాగే కేవలం ఒక సంవత్సరంలోనే ఐదు రెట్ల అభివృద్ధి పెరిగింది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది." మా ప్రయాణం 4 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే నమ్మశక్యంగా లేదు అని, వృద్ధి పరంగానే కాకుండా పేమెంట్స్, ఆర్థిక సేవలు సృష్టించగల సామాజిక ప్రభావాన్ని గ్రహించడంలో కూడా ఉంది" అని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సిఈఓ సమీర్ నిగం అన్నారు.
ఫోన్‌పే డిజిటల్ పేమెంటులో దేశంలో మొత్తం 175 మిలియన్లకు పైగా రిజిస్టర్ వినియోగదారులను కలిగి ఉంది అని తెలిపింది.భారతదేశంలోని 215 కి పైగా నగరాల్లో 80 లక్షల ఎంఎస్‌ఎంఇల ఫోన్‌పే యాప్ ని చెల్లింపులు చేయటానికి వాడుతున్నారు అలాగే దాని లావాదేవీలలో 56 శాతానికి పైగా ఇప్పుడు టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారులు వాడుపుతున్నారు.
ఈ సంవత్సరం ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి కొత్త వినియోగదారుల కోసం 'స్విచ్' కేసులను ప్రవేశపెట్టింది, ఇది ఇతర యాప్ లను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.ఫోన్‌పే యాప్ ఫుడ్, గ్రోసేరి, షాపింగ్ ఇంకా ట్రావెల్ యాప్ ల నుండి ఒకే ట్యాప్‌తో సులువుగా మారడానికి వినియోగదారులకు సహాయపడుతుంది.
also read హెచ్‌పి నుంచి కొత్త 10th జెన్ ల్యాప్టాప్....తక్కువ ధరకే...
డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పేలో 150 మిలియన్లకు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. దాని ప్లాట్‌ఫామ్‌లో 56 మిలియన్లకు పైగా సేవ్ చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులను కలిగి ఉంది. ఫోన్‌పే యాప్ ని 80 లక్షలకు పైగా వ్యాపార అవుట్‌లెట్లలో వినియోగిస్తున్నారు.