మెట్రో టిక్కెట్ల బుకింగ్: వాట్సాప్‌లో వినియోగదారులు సులభంగా టిక్కెట్‌లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని మెట్రో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌లో మెట్రో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, ముందుగా టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న నంబర్ కి హాయ్ అని పంపండి.
మీరు వాట్సాప్‌లో మెట్రో టికెట్, కరెంట్ బిల్లు, పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవును.. నిజం.. వాట్సాప్‌లో ఈ సేవ పూర్తిగా ఉచితం కూడా. అయితే వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. కరెంట్ బిల్లు, మెట్రో టిక్కెట్ లేదా పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ని ఇంటి నుండి లేదా ఎక్కడి నుండైనా WhatsAppలో సులభంగా పొందవచ్చు. ఇందుకు WhatsAppలో అనేక ప్రభుత్వ చాట్‌బాట్‌లు వినియోగదారులకు వివిధ సౌకర్యాలను అందిస్తాయి.
మెట్రో టిక్కెట్ల బుకింగ్: వాట్సాప్‌లో వినియోగదారులు సులభంగా టిక్కెట్‌లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని మెట్రో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌లో మెట్రో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, ముందుగా టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న నంబర్ కి హాయ్ అని పంపండి. ఆ తర్వాత మీ భాషను ఎంచుకుని 'టికెట్ బై నవ్' అప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఒక కొత్త మెసేజ్ కనిపిస్తుంది, ఇప్పుడు స్టేషన్లను సెలెక్ట్ చేసుకొవడానికి కొత్త విండో తెరవబడే దానిపై క్లిక్ చేయండి.
ఇందులో ఎక్కే స్టేషన్ అండ్ దిగే స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత టికెట్ మొత్తాన్ని చూస్తారు. WhatsApp సహాయంతో మీరు గరిష్టంగా 6 టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని గుర్తుంచుకోండి. దీని తర్వాత మీరు చెల్లించాల్సిన మొత్తం క్రింద కనిపిస్తుంది. చెల్లింపు తర్వాత, మీరు టికెట్ మెసేజ్ అందుకుంటారు, దాన్ని స్కాన్ చేయడం ద్వారా మీరు మెట్రోలో ప్రవేశించవచ్చు. వాట్సాప్ వినియోగదారులు తమకు కావాలంటే సులభంగా కరెంటు బిల్లును చెక్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ PDF ఫార్మాట్‌లో వస్తుంది. నిజానికి ఏ రాష్ట్ర ప్రజలైన సులభంగా కరెంటు బిల్లులు పొందవచ్చు
దీని కోసం మీరు మీ రాష్ట్రం లేదా విద్యుత్ సరఫరాదారు పేరు తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు అందించిన నంబర్‌కు మెసేజ్ పంపాలి, నంబర్ కోసం అధికారిక పేజీలో సులభంగా తెలుసుకోవచ్చు. ప్రతి రాష్ట్రం ఇంకా ప్రాంతం ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. వాట్సాప్ వినియోగదారులు చాట్‌లో లైసెన్స్, పాన్ కార్డ్ ఇంకా కొన్ని ముఖ్యమైన డాకుమెంట్స్ సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దీని కోసం మీరు నమస్తే, హాయ్ అని పంపాలి. ఆ తర్వాత యూజర్లకు ఒక మెసేజ్ వస్తుంది.
ఈ ప్రక్రియలో, వినియోగదారులు వారి ఆధార్ నంబర్‌ను అందించాలి. దీని తర్వాత మీరు OTP ఎంటర్ చేయడం ద్వారా సమాచారాన్ని వెరిఫై చేయాలి. దీని తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత, లైసెన్స్ PDF ఫైల్ Govt On WhatsApp చాట్‌లో కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసి చూడవచ్చు. ఈ ప్రక్రియ సహాయంతో, వినియోగదారులు పాన్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.