లేదు లేదు రావాల్సిందే.. వారానికి కనీసం 3 రోజులైన..

By Ashok kumar Sandra  |  First Published Dec 13, 2023, 6:03 PM IST

వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసుకి రండి, త్వరలో తప్పనిసరి అవుతుంది’ అని ఉద్యోగులకు ఆయా శాఖల ఇన్‌ఛార్జ్‌ల నుంచి మెసేజెస్ వచ్చాయి. అయితే ఉద్యోగుల రీకాల్‌పై ఇన్ఫోసిస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.


బెంగళూరు: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్  ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులైనా ఆఫీసుకి రావాలని కోరింది. కోవిడ్ కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రొం హోమ్ ముగించి ఆఫీసుకి తిరిగి రావాలని ఉద్యోగులని ఇప్పటికే అభ్యర్థించిన తర్వాత వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకి రావడాన్ని తప్పనిసరి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఉత్పాదకతను పెంచడానికి, ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఎక్కువ పని గంటలు అవసరమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇన్ఫోసిస్ ఈ చర్య తీసుకుంది.

వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసుకి రండి, త్వరలో తప్పనిసరి అవుతుంది’ అని ఉద్యోగులకు ఆయా శాఖల ఇన్‌ఛార్జ్‌ల నుంచి మెసేజెస్ వచ్చాయి. అయితే ఉద్యోగుల రీకాల్‌పై ఇన్ఫోసిస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇంతకుముందు ఆఫీసుకి 
 రావాల్సిందిగా ఉద్యోగులకు  పంపిన మెసేజ్‌లపై సీరియస్‌గా స్పందించలేదన్న అసంతృప్తి కూడా ప్రస్తుత మెయిల్‌లో ఉంది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రారంభమైన మూడు సంవత్సరాల వర్క్-ఫ్రమ్-హోమ్ పీరియడ్ చాలా అవసరమని, ఆరోగ్య కారణాలు లేకుంటే, ఉద్యోగులు ఆఫీసుకి వచ్చి పని ప్రారంభించాలని నోటిస్ పేర్కొంది.

Latest Videos

అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను వ్యక్తిగతంగా పరిశీలిస్తామని దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరో ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వారానికి మూడు రోజులు ఉద్యోగులు ఆఫీసుకి  వచ్చే హైబ్రిడ్ సిస్టమ్‌కు మారాలని గతంలో కోరింది. ఈ డిమాండ్‌పై ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన రాకపోతే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కంపెనీ తరఫు నుంచి రిమైండర్ కూడా వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఉద్యోగులను మళ్లీ ఆఫీసుకి రప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

click me!