Oppo Pad Air:బిగ్ బ్యాటరీతో ఒప్పో పాడ్ ఎయిర్.. త్వరలోనే లాంచ్.. ప్రారంభమైన బుకింగులు..

By asianet news telugu  |  First Published May 17, 2022, 1:29 PM IST

ఒప్పో పాడ్ ఎయిర్ 10.36-అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. అంతేకాకుండా ఈ ట్యాబ్ లో 7100mAh బ్యాటరీ ఇచ్చారు, దీనికి 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. ఈ ట్యాబ్‌లో నాలుగు స్పీకర్లు ఉంటాయి, వీటితో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ ఉంటుంది.
 


స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో  కొత్త టాబ్లెట్ ఒప్పో పాడ్ ఎయిర్ పేరుతో త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. నివేదిక ప్రకారం, Oppo చైనీస్ వెబ్‌సైట్‌లో Oppo Pad Air లిస్ట్ చేయబడింది ఇంకా లాంచ్ ముందే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మరో నివేదిక ప్రకారం, ఒప్పో ప్యాడ్ ఎయిర్ టచ్ సపోర్ట్‌తో 10.36-అంగుళాల ఎల్‌సి‌డి డిస్‌ప్లేను పొందుతుంది. డిస్ ప్లే  రిజల్యూషన్ 2000x1200 పిక్సెల్‌లు, 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ ధర 1,000 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ.11,500 ఉంటుందని చెబుతున్నారు.

 స్పెసిఫికేషన్ల గురించి అందిన సమాచారం ప్రకారం , Oppo Pad Airలో 10.36-అంగుళాల డిస్ ప్లే ఉంటుంది.  ఈ ట్యాబ్ 7100mAh బ్యాటరీతో,  18W ఛార్జింగ్‌కు సపోర్ట్ తో వస్తుంది. ఈ ట్యాబ్‌లో నాలుగు స్పీకర్లు ఉంటాయి, వీటితో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ ఉంటుంది.

Latest Videos

Oppo ప్యాడ్ ఎయిర్‌తో కంపెనీ ఫోల్డబుల్ కీబోర్డ్‌ను కూడా పరిచయం చేస్తుంది మరియు స్టైలస్ పెన్ కూడా ప్రారంభించబడుతుంది, అయితే Oppo అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్యాబ్ కీబోర్డ్, పెన్‌ కాంబో ఆఫర్‌తో వస్తుందని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో Oppo దేశీయ మార్కెట్లోకి Oppo ప్యాడ్‌తో టాబ్లెట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఒప్పో ప్యాడ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఒప్పో పెన్సిల్ స్టైలస్‌తో ప్రారంభించింది. ఒప్పో ప్యాడ్ ధర 2,299 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 26,300. ఒప్పో ప్యాడ్ జూన్ లేదా జూలై 2022 నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

click me!