వాట్సాప్ లో వస్తున్న మరో కొత్త అప్ డేట్.. ఇప్పుడు స్టేటస్ ఇలా ఉంటుంది..

By asianet news teluguFirst Published May 17, 2022, 10:55 AM IST
Highlights

2017లో, WhatsApp చాట్‌ల కోసం  లింక్ ప్రివ్యూ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు దానిని స్టేటస్ కోసం కూడా పరీక్షించబడుతోంది. ఆండ్రాయిడ్ యాప్ స్టేటస్ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది.
 

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్టేటస్‌కి కొత్త ఫీచర్‌ను జోడించబోతోంది. నివేదిక ప్రకారం, ఇప్పుడు లింక్ ప్రివ్యూ-వ్యూ కూడా స్టేటస్‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం, మనము స్టేటస్‌లో ఏదైనా URL లేదా లింక్‌ను షేర్ చేసినప్పుడు URLని మాత్రమే చూస్తాము కానీ కొత్త అప్‌డేట్ తర్వాత, థంబ్ ఇమేజ్‌తో పాటు మెటా డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, కొత్త అప్‌డేట్ తర్వాత సాదారాణ-url చూపబడదు.

 వాట్సాప్ ఫీచర్‌ను ట్రాక్ చేసే WABetaInfo కొత్త అప్‌డేట్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. WABetaInfo నివేదిక ప్రకారం, కొత్త ఫీచర్ iOS  బీటా వెర్షన్‌లో పరీక్షిస్తోంది. కొత్త ఫీచర్  స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. కొత్త ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్‌లో కూడా పరీక్షించవచ్చు.

2017లో WhatsApp చాట్ కోసం రీచ్ లింక్ ప్రివ్యూ అప్‌డేట్‌ను విడుదల చేసిందీ, ఇప్పుడు అది స్టేటస్ కోసం కూడా పరీక్షించబడుతుందీ. ఆండ్రాయిడ్ యాప్ స్టేటస్ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా వాట్సాప్ ఎమోజీ రియాక్షన్‌ను ప్రకటించారు. ఇది కాకుండా వాట్సాప్‌లో మరో గొప్ప ఫీచర్‌ను యాడ్ చేస్తోంది. వాట్సాప్‌లో ఎక్కువ మందిని యాడ్ చేయడానికి మీరు రెండు గ్రూపులను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే త్వరలో మీరు ఒకే వాట్సాప్ గ్రూప్‌లో 512 మందిని యాడ్ చేయవచ్చు.

ప్రస్తుతం, WhatsApp ఈ కొత్త ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్షించబడుతోంది. దీని అప్ డేట్  ఎప్పుడు విడుదల చేయబడుతుందనే దాని గురించి సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతం 256 మందిని మాత్రమే గ్రూప్‌లో చేర్చుకోవచ్చు.

click me!