MWC 2022: ఒప్పో వరల్డ్ రికార్డు.. కేవలం 9 నిమిషాల్లో ఈ ఛార్జర్‌తో బ్యాటరీ ఫుల్ ఛార్జ్..

By asianet news telugu  |  First Published Mar 2, 2022, 4:55 PM IST

ఒప్పో 2014లో వూక్ ఫ్లాష్ ఛార్జ్‌ని ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పూర్తిగా సురక్షితమని తెలిపింది. అలాగే దీని వల్ల ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగదు, ఛార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కదని వెల్లడించింది.


ఒప్పో ఎం‌డబల్యూ‌సి 2022లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను ప్రదర్శించింది. డెమో సమయంలో ఒప్పో కేవలం 9 నిమిషాల్లో 4500mAh బ్యాటరీతో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది.  షియోమీ (Xiaomi)లో 120W ఛార్జర్‌ ఉంది, ఈ చార్జర్ 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చేస్తుందని పేర్కొంది. ఇంతకుముందు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో రియల్ మీ  (Realme) 150W SUPERVOOC ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టింది, దీని ద్వారా ఫోన్ బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని పేర్కొంది.

ఒప్పో 240W సూపర్ వూక్ (SUPERVOOC) ఛార్జర్‌తో చరిత్ర
డెమో సమయంలో ఒప్పో 240W ఛార్జర్‌తో కేవలం 9 నిమిషాల్లో 4500mAh బ్యాటరీతో 1% నుండి 100% వరకు ఛార్జింగ్ అయ్యేలా చూపింది. ఒప్పో 2014లో వూక్ ఫ్లాష్ ఛార్జ్‌ని ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పూర్తిగా సురక్షితమని ఒప్పో తెలిపింది. దీని వల్ల ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగదు, ఛార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కదు అని వెల్లడించింది.

Latest Videos

కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు ఒప్పో కొత్త 'బ్యాటరీ హెల్త్ ఇంజిన్' కూడా సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ బ్యాటరీ హెల్త్ అల్గోరిథం అండ్ బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీ రెండూ ఈ ఛార్జర్‌లో ఉపయోగించబడ్డాయి. వీటిలో, స్మార్ట్ బ్యాటరీ హెల్త్ అల్గారిథమ్ బ్యాటరీ  విద్యుత్ సామర్థ్యాన్ని రియల్ టైమ్ లో ట్రాక్ చేస్తుంది. బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీ, మరోవైపు బ్యాటరీ ఇంటర్నల్ భాగాలను ఆప్టిమైజ్ చేస్తుంది.
 

click me!