Jio Prepaid Plan:రోజుకి 1జి‌బి డేటాతో జియో చౌకైన ప్లాన్.. 3 వారాల వాలిడిటీతో బెనెఫిట్స్ ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Mar 01, 2022, 04:12 PM IST
Jio Prepaid Plan:రోజుకి 1జి‌బి డేటాతో జియో చౌకైన ప్లాన్.. 3 వారాల వాలిడిటీతో బెనెఫిట్స్ ఇవే..

సారాంశం

చాలా ప్లాన్‌లు రోజుకు 1జి‌బి డేటాతో ఉంటాయి అలాగే మరికొన్ని  ప్రతిరోజూ 3జి‌బి డేటాతో ఉంటాయి, అయితే రోజుకు 1జి‌బి డేటాగల ప్లాన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 

రిలయన్స్ జియో ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. జియోకు 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. జియో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఎన్నో రకాల ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. చాలా ప్లాన్‌లు రోజుకు 1జి‌బి డేటాతో ఉంటాయి అలాగే మరికొన్ని  ప్రతిరోజూ 3జి‌బి డేటాతో ఉంటాయి, అయితే రోజుకు 1జి‌బి డేటాగల ప్లాన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా మంది ప్రతిరోజూ 1జి‌బి డేటాతో జియో ప్లాన్‌ని ఉపయోగిస్తున్నారు లేదా ఇలాంటి ప్లాన్‌ల కోసం వెతుకుతూ ఉంటారు.  రోజుకు 1జి‌బి డేటాతో జియో అన్ని ప్లాన్‌ల గురించి మీకోసం..

జియో రూ.149 ప్లాన్
జియో ఈ ప్లాన్‌తో  ప్రతిరోజూ 1జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 20 రోజులు. ఇంకా ప్రతిరోజుకు 1జి‌బి డేటా అందిస్తున్న కంపెనీ చౌకైన ప్లాన్. ఈ ప్లాన్‌లో మొత్తం 20జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. డేటాతో పాటు, ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఇచ్చారు. ఇంకా రోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉంటాయి.

జియో రూ 179 ప్లాన్
ఈ ప్లాన్ తో రోజుకు 1 GB డేటాతో కంపెనీ చౌకైనా రెండవ ప్లాన్. జియో రూ. 179 ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. ఇందులో కూడా ఆన్ లిమిటెడ్ కాలింగ్ , రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.

జియో రూ.209 ప్లాన్
జియో రూ.209 ప్రీ-పెయిడ్ ప్లాన్‌తో ప్రతిరోజూ 1జి‌బి డేటా కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో కూడా ఆన్ లిమిటెడ్ కాలింగ్, అన్ని జియో యాప్‌లకు యాక్సెస్‌తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు అందుబాటులో ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Samsung Galaxy S25 Ultra పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 34,000 తగ్గిన ధర
Google Messages New Feature: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ తీసుకొచ్చిన ట్యాప్ టు డ్రాఫ్ట్ ఫీచర్ ఏంటో తెలుసా?