చాలా సందర్భాలలో వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా పార్లే జీ బిస్కెట్లు లేదా సబ్బు వేరే ఇంకేదో వచ్చినట్లు వినే ఉంటారు కాని ఈసారి ఇలాంటిది ఏమి జరిగాయి కానీ ఒక అద్భుతం చోటు చేసుకుంది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏదో కొంటె ఇంకేదో వచ్చినట్లు తరచుగా వార్తల్లో చూస్తుంటాం.... చాలా సందర్భాలలో వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా పార్లే జీ బిస్కెట్లు లేదా సబ్బు వేరే ఇంకేదో వచ్చినట్లు వినే ఉంటారు కాని ఈసారి ఇలాంటిది ఏమి జరిగాయి కానీ ఒక అద్భుతం చోటు చేసుకుంది.
ఒక వ్యక్తి ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే ఫోన్‌కు బదులుగా టేబుల్ వచ్చింది. ప్రత్యేక విషయం ఏమిటంటే, కస్టమర్ కి పంపిణీ చేసిన టేబుల్ సరిగ్గా ఐఫోన్ లాగా ఉంటుంది.
undefined
మలేషియాలోని ఒక నివేదిక ప్రకారం, ఒక యువకుడు ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుండి తక్కువ ధరను చూసిన ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు, కాని అతను ఉత్పత్తి వివరణను సరిగ్గా చూడలేదు. యువకుడు ఐఫోన్‌కు బదులుగా ఐఫోన్ లాంటి టేబుల్‌ను ఆర్డర్ చేసినట్లు తేలింది. ఆర్డర్ డెలివరీ తర్వాత అతను ప్యాకెట్ చూస్తే మనిషి అంతా సైజ్ ఉన్న ఐఫోన్ బయటకు వచ్చింది.
also read
ఈ ఐఫోన్ టేబుల్ తో పాటు టేబుల్ కి అమర్చడానికి నాలుగు కాళ్ళు కూడా వచ్చాయి. ఈ ఐఫోన్ టేబుల్ ఆకర్షణీయంగా ఐఫోన్ 6 ఎస్ కు పూర్తిగా సమానంగా ఉంటుంది, కాకపోతే సైజ్ లో మాత్రమే తేడా. ఈ ఐఫోన్ టేబుల్ కి టచ్ ఐడి కూడా ఉంది. ఐఫోన్ టేబుల్ తో ఉన్న ఈ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
2019లో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే చేతిలో పట్టుకునే ఐఫోన్ స్టిక్కర్‌తో కూడిన నకిలీ ఫోన్ వచ్చింది. దీనికి ముందు స్మార్ట్‌ఫోన్‌ల బదులు ప్రజలకు ఇతర వస్తువులు, రాళ్ళు కూడా వచ్చాయి.