ఐఫోన్స్ పై హోలీ క్రేజీ ఆఫర్‌ : కొద్ది రోజులే మాత్రమే అవకాశం..

Ashok Kumar   | Asianet News
Published : Mar 24, 2021, 05:12 PM IST
ఐఫోన్స్ పై  హోలీ క్రేజీ ఆఫర్‌ : కొద్ది రోజులే మాత్రమే అవకాశం..

సారాంశం

 ఈ ఆఫర్‌ను ఆపిల్ ప్రీమియం రిసెల్లార్ ఇమాజిన్ హోస్ట్ చేస్తుంది. ఈ ఆఫర్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండింటిలో ఐఫోన్ 11 ను కొనుగోలు చేసే వినియోగదారులకు వర్తిస్తుంది. 

హోలీ పండుగ సందర్భంగా  ఐఫోన్ 11 పై పరిమిత-కాల ఆఫర్ కింద భారీ తగ్గింపు ఆఫర్ తో అందిస్తుంది. ఈ ఆఫర్‌ను ఆపిల్ ప్రీమియం రిసెల్లార్ ఇమాజిన్ హోస్ట్ చేస్తుంది. ఈ ఆఫర్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండింటిలో ఐఫోన్ 11 ను కొనుగోలు చేసే వినియోగదారులకు వర్తిస్తుంది.

హోలీ ఆఫర్‌లో రూ. 5,000 క్యాష్‌ బ్యాక్‌తోపాటు, ఇతర యాక్ససరీస్‌పై  రూ. 8వేలను తగ్గింపును ఆఫర్‌  చేస్తోంది.  దీంతోపాటు,ఎక్స్ఛేంజ్ బోనస్‌ కింద అదనంగా రూ. 3 వేల తగ్గింపు లభించనుంది. అలాగే ఐఫోన్ 12 మినీ  ఐఫోన్ 12 లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. 

2019 సెప్టెంబర్ లో లాంచ్‌ అయిన  ఐఫోన్ 11  ప్రారంభ ధర రూ. రూ. 54,900.  దేశీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఇది ఒకటి. మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఓమ్డియా  2020 లో అత్యధికంగా అమ్ముడు పోయిన స్మార్ట్‌ఫోన్  ఐఫోన్ 11 అని ఇటీవల పేర్కొంది.

also read మీరు నిద్రపోతే టీవీని ఆఫ్ చేసే ఫీచర్ తో వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది..

ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ, 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో  బ్లాక్, గ్రీన్, రెడ్, పర్పుల్, ఎల్లో వైట్ అనే ఆరు రంగుల్లో లభిస్తుంది.  

ఇమాజిన్ హోలీ ఆఫర్‌లో  భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు లేదా ఈజీఇఎంఐ ఎంపికల ద్వారా కొనుగోళ్లు చేసే వినియోగదారులకు 5,000 క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.  ఇమాజిన్ ఐఫోన్ 12 మినీ పై రూ.48,900, ఐఫోన్ 12 పై రూ. 65,900 ఆఫర్ చేస్తుంది.

ఇమాజిన్ వెబ్‌సైట్ ఇంకా రిటైల్ స్టోర్ల ద్వారా వినియోగదారులు హోలీ ఆఫర్‌ను పొందవచ్చు. ఆఫర్ ఎంతకాలం ఉంటుందని పై వెల్లడించలేదు. అయితే హెచ్‌డిఎఫ్‌సి క్యాష్‌బ్యాక్ మార్చి 27 వరకు మాత్రమే వర్తిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే