OnePlus Nord CE 2 Lite: వన్​ప్లస్​ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్​ఫోన్.. ఫీచర్ల వివరాలివే..!

By team telugu  |  First Published Feb 3, 2022, 4:25 PM IST

స్మార్ట్​ఫోన్​ దిగ్గజం వన్​ప్లస్ (OnePlus) నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్​ఫోన్​(Smartphone) రానుంది. వన్​ప్లస్​ తన మొట్టమొదటి లైట్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 2 లైట్​ 5Gని లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది.


స్మార్ట్​ఫోన్​ దిగ్గజం వన్​ప్లస్ (OnePlus) నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్​ఫోన్​(Smartphone) రానుంది. వన్​ప్లస్​ తన మొట్టమొదటి లైట్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 2 లైట్​ 5Gని లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. దీన్ని రూ. 20 వేలలోపు బడ్జెట్ ​(Budget) ధరలోనే ఆవిష్కరించనుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. ఇదే నిజమైతే, ఇప్పటివరకు వన్​ప్లస్​ నుంచి విడుదలైన అతి చౌకైన స్మార్ట్​ఫోన్​ ఇదే కానుంది. గత కొంత కాలంగా వన్​ప్లస్ తన ​నార్డ్ సిరీస్​లో నార్ట్​ సీఈ 2, నార్డ్​ 2టీ ఫోన్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. మరోవైపు, తన 10 సిరీస్‌లలో 10 అల్ట్రా, 10 ఆర్​ ఫోన్లు తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.

ఇదే సమయంలో గతేడాది బడ్జెట్ ధరలోనే​ విడుదలైన వన్​ప్లస్​ నార్డ్​ సీఈకి కొనసాగింపుగా త్వరలోనే నార్డ్​ సీఈ2 లైట్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ను వన్​ప్లస్​ నార్డ్​ సీఈ కంటే తక్కువ ధరలోనే విడుదల చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 2 లైట్​ స్మార్ట్​ఫోన్​ రూ. 20,000లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ మొదట భారత మార్కెట్​లోకి రానుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాతే గ్లోబల్​ మార్కెట్​లోకి రిలీజ్​ కానుంది.

Latest Videos

వన్​ప్లస్​ నార్డ్ సీఈ 2 లైట్ 5G స్పెసిఫికేషన్లు
ఆన్​లైన్​లో లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, వన్​ప్లస్​ నార్డ్​ CE 2 లైట్​ 5G స్మార్ట్​ఫోన్​ 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 -అంగుళాల ఫుల్ హెచ్​డీ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్​పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ గరిష్టంగా 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​తో వస్తుంది. ఇది క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 659 5G చిప్‌సెట్​తో పనిచేస్తుంది. వన్​ప్లస్​ నార్డ్​ సీఈ2 లైట్​ 5జీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

కెమెరా విషయానికి వస్తే.. నార్డ్​ సీఈ2 లైట్​ 5G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, రెండు 2 ఎంపీ సెన్సార్లు కెమెరాలను చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం 16 ఎంపీ కెమెరాను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ 5జీ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని లీకేజీలను బట్టి తెలుస్తోంది.
 

click me!