బోట్ మనదేశంలో ఎయిర్ డోప్స్ 11 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేశాయి. వీటి ధరను రూ.1,499గా నిర్ణయించారు. స్నో వైట్, కార్బన్ బ్లాక్, ఓషన్ బ్లూ, శాండ్ పెరల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
బోట్ మనదేశంలో ఎయిర్ డోప్స్ 11 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేశాయి. వీటి ధరను రూ.1,499గా నిర్ణయించారు. స్నో వైట్, కార్బన్ బ్లాక్, ఓషన్ బ్లూ, శాండ్ పెరల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఇవి రూ.1,299కే అందుబాటులో ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి ధర రూ.1,499గా ఉంది.
బోట్ ఎయిర్‌డోప్స్ 111 ఫీచర్లు
ఇందులో 13 ఎంఎం డ్రైవర్ సెటప్‌ను అందించారు. వన్ కమాండ్ ప్లేబ్యాక్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కాల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు మీరు ఫోన్‌కి కనెక్ట్ చేస్తే వాతావరణం, వార్తలు, తాజా క్రికెట్ స్కోర్లను కూడా సింగిల్ ట్యాప్ ద్వారా ఇందులో వినవచ్చు.
బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఫీచర్‌ను ఇందులో అందించారు. 10 మీటర్ల రేంజ్‌లో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఐవోఎస్, ఆండ్రాయిడ్, ల్యాప్‌టాప్స్, మ్యూజిక్ ప్లేయిర్, ఇతర బ్లూటూత్ కంపాటిబుల్ డివైస్‌లతో దీన్ని కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏడు గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. కేస్‌తో కలిపితే మొత్తంగా 28 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జింగ్ చేయవచ్చు. ఐదు నిమిషాలు చార్జింగ్ పెడితే 45 నిమిషాల బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి.
ఇందులో ఐడబ్ల్యూపీ టెక్నాలజీని అందించారు. దీని ద్వారా లిడ్ ఓపెన్ చేయగానే ఇవి స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. కేస్‌తో కలిపితే దీని బరువు 50 గ్రాములుగా ఉంది. ఇటీవలే బోట్ ఎయిర్ డోప్స్ 181 ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను అందించారు. వీటి ధర రూ.1,499 నుంచి ప్రారంభం కానుంది. ఇది బోల్డ్ బ్లూ, కార్బన్ బ్లాక్, కూల్ గ్రే, స్పిరిట్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.