తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉంది.
తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఉంది. చైనా మొబైల్ సంస్థ రెడ్మీ.. రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను చాల రోజుల క్రితం లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మొబైలే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు ఈఎంఐతో అందుబాటులో వచ్చింది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఇండియా మరియు ఎంఐ.కామ్‌లో అమ్మకానికి అందుబాటులో లేదు.
రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్లలో (4GB RAM + 64GB, 4GB RAM + 128GB, 6GB RAM + 128GB) అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13,799 ధరకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,989గా నిర్ణయించారు. ఆక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్ రూ. 479 ప్రారంభ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.
undefined
రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్ బ్యాక్ కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా.. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
రెడ్మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బరువు 198 గ్రాములుగా ఉంది.