ఈ ఫోన్‌ని రెండు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్స్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్‌ను ఆగస్టు 4న ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వన్ ప్లస్ అతితక్కువ ధర ఫోన్ వన్ ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్‌ఈ సేల్స్ మొదలయ్యాయి. ఈ ఫోన్‌ని రెండు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్స్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్‌ను ఆగస్టు 4న ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వన్ ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్‌ఈలో లభిస్తుంది. ఇంకా పెద్ద డిస్‌ప్లే, డ్యూయల్ స్పీకర్‌లతో ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ధర
వన్ ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్‌ఈ బ్లూ ఒయాసిస్, సెలెస్టియల్ బ్లాక్ కలర్‌లో పరిచయం చేసారు. ఫోన్ సింగిల్ స్టోరేజ్‌లో వస్తుంది, అంటే 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ ధర రూ. 14,990. OnePlus ఇప్పటివరకు అందించిన అతి తక్కువ ధర ఉన్న ఫోన్ కూడా ఇదే.
undefined
స్పెసిఫికేషన్‌లు
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 12తో ఆక్సిజన్‌ఓఎస్ 12.1 ఇచ్చారు. ఇంకా 6.56 అంగుళాల డిస్‌ప్లే , 60Hz రిఫ్రెష్ రేట్, 1612×720 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా దీని బాడీ 2D స్లిమ్‌గా ఉంటుంది. octa-core MediaTek Helio G35 ప్రాసెసర్ ఫోన్‌లో సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ ఇచ్చారు.
కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ
ఈ ఫోన్ కి 33W SuperVooc ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ లభిస్తుంది. ఇంకా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.