ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే బ్యాటరీ వినియోగం ఎక్కువ ఉంటుంది.
డిజిటల్ ప్రపంచం అండ్ సోషల్ మీడియా యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరికీ అవసరం అయిపోయాయి. స్మార్ట్‌ఫోన్‌లో హైటెక్ ఫీచర్లు, కెమెరాతో పాటు, మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఇప్పుడు అవసరం. అయితే స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్, కెమెరాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోతుంటుంది. కానీ ఒకోసారి ఫోన్ బ్యాటరీ అవసరమైనప్పుడే అయిపోతుంది. దీంతో ఫోన్‌ను రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువసార్లు ఛార్జ్ చేయడం లేదా పవర్ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్ళాల్సి వస్తుంది. మీరు కూడా ఫోన్ బ్యాటరీ లైఫ్ గురించి ఆందోళన పడుతున్నారా.. అయితే ఫోన్ బ్యాటరీకి సంబంధించిన కొన్ని టిప్స్ మీకోసం.. దీని ద్వారా ఫోన్ మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేయకుండా మీకు సహాయపడుతుంది...
టిప్- 1
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే బ్యాటరీ వినియోగం ఎక్కువ ఉంటుంది. బ్యాటరీని ఆదా చేయడానికి మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్ళి ఆటోమేటిక్ రిఫ్రెష్ రేట్‌ను సెట్ చేయవచ్చు, దీంతో ఫోన్ డిస్‌ప్లేని అవసరాన్ని బట్టి 60Hz లేదా 90Hzకి సెట్ చేస్తుంది. దీంతో ఫోన్ బ్యాటరీ లైఫ్ బాగా పెంచుతుంది.
undefined
టిప్ -2
ఎక్కువ బ్రైట్‌నెస్ కూడా మీ ఫోన్ బ్యాటరీ అధికంగా వినియోగిస్తుంది. మీరు రిఫ్రెష్ రేట్‌తో పాటు డిస్‌ప్లేను ఆటో బ్రైటెన్ మోడ్‌కి కూడా సెట్ చేయవచ్చు. ఫోన్ బ్రైట్‌నెస్‌ను 50 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి లేదా ఆటో-బ్రైట్‌నెస్ మోడ్‌కి సెట్ చేయడం బెస్ట్ మార్గం, దీని ద్వారా మీ బ్యాటరీ లైఫ్ చాలా పెంచుతుంది.
టిప్ -3
స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవింగ్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మీరు బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. దీని కోసం మీరు సెట్టింగ్‌లకు వెళ్లి డ్యూయల్ సిమ్స్ & మొబైల్ నెట్‌వర్క్‌పై నొక్కండి. ఇక్కడ డేటా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లో డేటా సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయాలి. దీనితో ప్రస్తుతం మీ స్క్రీన్‌పై రన్ అవుతున్న యాప్‌లో మాత్రమే మీ ఫోన్ డేటా, బ్యాటరీని వినియోగించుకుంటుంది. ఇతర యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేయవు లేదా డేటాను వినియోగించవు.
టిప్ -4
ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడానికి అనవసరమైన నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం బెస్ట్ ఆప్షన్. మీరు అవసరం లేనప్పుడు GPS లొకేషన్ అండ్ బ్లూటూత్‌ను కూడా ఆఫ్ చేయవచ్చు. ఇలా చేస్తే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుంది. అలాగే, మీ ఫోన్ అండ్ యాప్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. అప్-టు-డేట్‌గా ఉండటం వల్ల ఫోన్ ఫాస్ట్ అవుతుంది ఇంకా తక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది.