OnePlus 9RT: భారత్‌లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ లాంచ్.. ధ‌ర ఎంతంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 15, 2022, 12:18 PM ISTUpdated : Jan 15, 2022, 12:33 PM IST
OnePlus 9RT: భారత్‌లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ లాంచ్.. ధ‌ర ఎంతంటే..?

సారాంశం

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టింది. పవర్‌ఫుల్‌ ప్రాసెసర్ సహా మంచి స్పెసిఫికేషన్లతో వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ మొబైల్ విడుదలైంది. గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలో లాంచ్ ఈ అయిన ఈ ఫోన్‌ను.. అదే స్పెసిఫికేషన్లతో మన దేశానికి తీసుకొచ్చింది వన్‌ప్లస్‌.

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టింది. పవర్‌ఫుల్‌ ప్రాసెసర్ సహా మంచి స్పెసిఫికేషన్లతో వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ మొబైల్ విడుదలైంది. గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలో లాంచ్ ఈ అయిన ఈ ఫోన్‌ను.. అదే స్పెసిఫికేషన్లతో మన దేశానికి తీసుకొచ్చింది OnePlus. వన్‌ప్లస్‌ 9ఆర్ (OnePlus 9R) కు అప్ గ్రేడెడ్ మోడ‌ల్‌గా 9ఆర్‌టీ వచ్చింది. 

వ‌న్ ప్ల‌స్‌ 9RT 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర భార‌త్‌లో రూ.42,999గా ఉంది. 12GB + 256GB మోడల్ ధర రూ.46,999గా వన్‌ప్లస్‌ నిర్ణయించింది. అలాగే నానో సిల్వర్, హ్యాకర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) ప్రారంభమయ్యే జనవరి 17న అమెజాన్ లో OnePlus 9RT మొబైల్‌ అమ్మకాలు మొదలుకానున్నాయి.

1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ తో కూడిన 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 AMOLED డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. అలాగే 120 హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, SRGB సపోర్టు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన ఉంది. దీంతో పాటు హైపర్ టచ్ 2.0, రీడింగ్ మోడ్, ప్రత్యేకమైన నైట్ మోడ్ డిస్‌ప్లే ఫీచర్లుగా ఉన్నాయి. అడ్రెనో 660 జీపీయూ (GPU)తో అక్టాకోర్ 5జీ చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 888 (Snapdragon 888) ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 9ఆర్‌టీ వస్తోంది. ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ తో ఈ ఫోన్‌ నడవనుంది.

ఈ ఫోన్‌ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టు ఉన్న 50MP సోనీ ఐఎంఎక్స్766 ప్రధాన కెమెరా, 16MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5G, 4G LTE, జీపీఎస్, బ్లూటూత్, డ్యుయల్ బ్యాండ్ వైఫై సహా ముఖ్యమైన కనెక్టివిటీ ఫీచర్లన్నీ ఉన్నాయి. ఇక డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ మొబైల్‌ వస్తోంది. OnePlus 9RT మొబైల్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 65వాట్ల వ్రాప్ చార్జింగ్ కు సపోర్టు చేయనుంది. దీని ద్వారా 100 శాతం చార్జింగ్ 30 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని OnePlus పేర్కొంది. ఈ ఫోన్‌ 8.28MM మందం ఉండగా.. 198.5 గ్రాముల బరువు ఉంది.

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా