లైంగిక వేధింపులు.. మైక్రోసాఫ్ట్ లో కీలక నిర్ణయం..!

By Ramya news team  |  First Published Jan 15, 2022, 11:27 AM IST

సంస్థ విధానాలను సమీక్షించేందుకు థర్డ్ పార్టీ  న్యాయ సంస్థను మైక్రో సాఫ్ట్ నియమించుకోనున్నట్లు ది సియాటెల్ టైమ్స్ ఈ మేరకు  ఓ కథనం ప్రచురించడం గమనార్హం.


ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో లైంగిక వేధింపుల ఆరోపణలు, లింగ వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు  వస్తే. వాటి వివరాలను బహిరంగంగా వెల్లడించనున్నట్లు తెలిపింది.  ఇందుకు అనుగుణంగా తమ విధానాలను సమీక్షిస్తామని చెప్పింది.

మైక్రోసాఫ్ట్  సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సహా బోర్డు డైరెక్టర్లందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సంస్థ విధానాలను సమీక్షించేందుకు థర్డ్ పార్టీ  న్యాయ సంస్థను మైక్రో సాఫ్ట్ నియమించుకోనున్నట్లు ది సియాటెల్ టైమ్స్ ఈ మేరకు  ఓ కథనం ప్రచురించడం గమనార్హం.

Latest Videos

ఇతర సంస్థలు ఎలాంటి విధానాలు పాటిస్తున్నాయి. ఉద్యోగులను, ఎగ్జిక్యూటివ్ లను జవాబుదారీగా ఉంచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలను థర్డ్ పార్టీ సంస్థ పరిశీలించనుంది. మైక్రో సాఫ్ట్ లో ఇప్పటి దాకా... ఎన్ని లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణలు జరిగాయి..? వాటి తీర్మానాలేంటి..? అనే వివరాలను కూడా సమీక్ష అనంతరం బహిరంగంగా వెల్లడించనున్నారు. కేవలం నివేదికను సమీక్షించడమే కాకుండా..  ఉద్యోగులకు అనువైన వాతావరణం కల్పించుకునేందుకు ఏం చేయాలనే విషయాలను తెలుసుకుంటామని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. 

click me!