బడ్జెట్ రేంజ్‌లో భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్(smartphone)ను తీసుకురానుంది రియల్‌మీ(realme). వియత్నాంలో ఇటీవల విడుదల చేసిన రియల్‌మీ 9ఐ (Real me 9i) మొబైల్‌ను భారత్‌లో కూడా విడుదల చేయనుంది. జనవరి 18న రియల్‌మీ 9ఐను భారత్‌లో లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ.
బడ్జెట్ రేంజ్‌లో భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది రియల్‌మీ. వియత్నాంలో ఇటీవల విడుదల చేసిన రియల్‌మీ 9ఐ (Real me 9i) మొబైల్‌ను భారత్‌లో కూడా విడుదల చేయనుంది. జనవరి 18న రియల్‌మీ 9ఐను భారత్‌లో లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ మేరకు రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అలాగే రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ కూడా సంస్థ తమ అంతర్జాతీయ బిజినెస్ గ్రూప్ లో ఈ స్మార్ట్‌ఫోన్ గురించి వెల్లడించారు. కొత్త ఫోన్ తీసుకొస్తున్నట్టు రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో ఉంది. దాని పేరును రియల్‌మీ 9ఐగా స్పష్టం చేసింది. వియత్నాంలో ఈ ఫోన్ ఇటీవల లాంచ్ అయ్యింది. భారత్‌లో జనవరి 18న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఈ మొబైల్ వస్తోంది. 90హెట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కు సపోర్టు చేసే ఈ డిస్‌ప్లేలో 480నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వరకు ఉంటుంది. అలాగే Realme 9iలో స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉండనున్నాయి. 50 MP ప్రధాన కెమెరా, 2 MP మోనోక్రోమ్, 2 MP మాక్రో కెమెరాలు ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Realme 9i మొబైల్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా.. 33W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0పై ఈ ఫోన్ నడవనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు సహా మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ఉన్న Realme 9i ధర వియత్నాంలో 62,90,000 డాంగ్స్ (దాదాపు రూ.20,500)గా ఉంది. అయితే భారత్‌లో రూ.13,999 నుంచి రూ.14,499 మధ్యలోనే ఈ ఫోన్ ధర ఉండే అవకాశం ఉంది.