ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను సేవ్ చేయడంలో చాల మంది ఇబ్బందులు ఎదురుకొంటుంటారు. ఇప్పుడు కంపెనీ ఈ సమస్యను పరిష్కరించింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ లేకుండా సేవ్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో కొత్త టిక్‌టాక్‌గా మారింది. 2020లో టిక్‌టాక్ నిషేధం తర్వాత, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది, ఇది ఒక షార్ట్ వీడియో ఫీచర్ అంతే కాదు ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌కు చాలా మంచి చేసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అపారమైన విజయం తర్వాత, మెటా ఫేస్‌బుక్‌లో కూడా రీల్స్ ఫీచర్‌ను విడుదల చేసింది. రీల్స్ భారతదేశంలో చాల పాపులారిటీ పొందాయి ఇంకా ఇంటర్నెట్ వినియోగదారులందరికీ దీని గురించి తెలుసు...
ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుండే సేవ్
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను సేవ్ చేయడంలో చాల మంది ఇబ్బందులు ఎదురుకొంటుంటారు. ఇప్పుడు కంపెనీ ఈ సమస్యను పరిష్కరించింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ లేకుండా సేవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫీచర్ అమెరికాలో పరిచయం చేయబడింది, కానీ ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం కూడా తీసుకొచ్చారు.
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫీచర్ రాకముందు, రీల్స్ సేవ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ రీల్స్ సేవర్ యాప్ అవసరం ఉండేది.
థర్డ్ పార్టీ యాప్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను సేవ్ చేయడం ఎలా..
*పబ్లిక్‌గా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అన్నిటిని యాప్ నుండే సేవ్ చేసుకోవచ్చు.
*దీని కోసం, ముందుగా మీరు సేవ్ చేయాలనుకుంటున్న రీల్స్‌ను సెలెక్ట్ చేసుకోండి.
*ఇప్పుడు షేర్ బటన్ పై క్లిక్ చేయండి.
*దీని తర్వాత మీరు క్రింద చాలా అప్షన్స్ చూస్తారు.
*వాటిలో సేవ్ సింబల్ పై క్లిక్ చేయండి.
*దీని తర్వాత రీల్స్ మీ ఫోన్ లో డౌన్‌లోడ్ అవుతుంది.