గూగుల్ మ్యాప్స్ లో త్వరలోనే కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. యూజర్లు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాలకు దారిని చూపడంతో పాటు ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో Google Maps వినియోగదారులకు సేవలు అందిస్తోంది. రానున్న రోజుల్లో అప్‌డేట్ ద్వారా అందరికీ నూతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్లినప్పుడు రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతుంటారు. అయితే ఇకపై వెళ్లే మార్గంలో ఎక్కడైనా టోల్ ప్లాజా ఉన్నా అక్కడి టోల్ ధరలు గూగుల్ మ్యాప్స్‌లో కనిపించనున్నాయి. గూగుల్ మ్యాప్స్ టోల్ ధరలకు సంబంధించి కొత్త ఫీచర్ రిలీజ్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ ట్రిప్‌ను ప్రారంభానికి ముందే టోల్ మొత్తాన్ని లెక్కించేందుకు యూజర్లకు సులభతరం చేస్తుంది. టోల్ సంబంధిత సమాచారం స్థానిక టోలింగ్ అధికారుల సాయంతో డిస్‌ప్లే చేయనుంది. మీరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్రయాణంలో మీకు ఎంత టోల్ వసూలు చేస్తారో ముందే తెలుసుకోవచ్చు, తద్వారా టోల్ గేట్‌లు ఉండే రూట్ బెటరా లేదా ఎక్కువ టోల్స్ చెల్లించాల్సిన అవసరం లేని రూట్ బెటరా? అని నిర్ణయించుకోవచ్చు.
మీరు వెళ్లాల్సిన గమ్యస్థానానికి ఎంతవరకు టోల్ చెల్లించాల్సి ఉంటుందో ఆయా ధరలను గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు. Google మ్యాప్స్‌లోకి వెళ్లి దిశల ఎగువన కుడివైపు భాగంలో మూడు డాట్స్ కనిపిస్తాయి. దానిపై నొక్కడం ద్వారా యూజర్లు తాము వెళ్లే టోల్ మార్గాలను పూర్తిగా అవైడ్ చేసుకోవచ్చు. మీకు టోల్ గేట్ లేని మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. భారత్, అమెరికా, జపాన్, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లోని దాదాపు 2వేల టోల్ రోడ్లకు ఈ నెలలో ఆండ్రాయిడ్ ఐఓఎస్ (iOS)లలో టోల్ ధరలను రిలీజ్ చేయనున్నట్టు గూగుల్ వెల్లడించింది. అయితే ఈ దేశాలతో పాటు త్వరలో మరిన్ని దేశాలకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
undefined
Google, iOS యూజర్ల కోసం పిన్ Trip Widget ,Apple వాచ్ నుంచి డైరెక్ట్ నావిగేషన్, Siri షార్ట్‌కట్‌ల యాప్‌లోకి Google Maps ఇంటిగ్రేషన్ కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త పిన్ చేసిన ట్రిప్ విడ్జెట్ సాయంతో యూజర్లు సులభంగా iOS హోమ్ స్క్రీన్ నుంచి Go Tabలో పిన్ చేసిన ట్రిప్‌లను యాక్సస్ చేసుకోవచ్చు. రూట్ డైరెక్షన్ ఈజీగా తెలుసుకోవచ్చు. Apple వాచ్ యూజర్లు త్వరలో వారి వాచ్ నుంచి నేరుగా Google Mapsలో డైరెక్షన్లను చూడొచ్చు. ఐఫోన్ నుంచి నావిగేషన్ ప్రారంభించాల్సిన అవసరం ఉండదని గూగుల్ చెబుతోంది. ఆపిల్ వాచ్ యాప్‌లోని Google మ్యాప్స్ బటన్ నొక్కడం ద్వారా యాపిల్ వాచ్‌లోనే నావిగేషన్ ఆటోమాటిక్‌గా ఓపెన్ అయిపోతుంది.
అంతేకాదు.. యూజర్లు తమ వాచ్‌కి ‘Take me Home’ కాంప్లికేషన్‌ను గూగుల్ మ్యాప్స్‌లో నావిగేట్ చేయొచ్చునని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. Google Maps Siri షార్ట్‌కట్‌ల యాప్‌ను iOS స్పాట్‌లైట్‌లోకి కూడా ఇంటిగ్రేడ్ చేసింది. షార్ట్‌కట్స్ ఒకసారి సెటప్ చేసిన తర్వాత.. Google Maps డేటాను వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ‘Hey Siri, డైరెక్షన్స్ అడగండి లేదా ‘Hey Siri అని Google Mapsలో సెర్చ్ చేయండి’ అని చెప్పండి. రాబోయే నెలల్లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. కొత్త విడ్జెట్ ఇతర ఫీచర్‌లను పొందేందుకు మీ Google మ్యాప్స్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.