గోల్డెన్ ఆఫర్: ఇప్పుడు కేవలం రూ.299కే కొత్త 4జి స్మార్ట్‌ఫోన్‌ ఇంటికి తీసుకెళ్లండి.. ఎలా అంటే ?

By S Ashok Kumar  |  First Published Mar 10, 2021, 11:15 AM IST

ఏడు కోట్లకు పైగా కస్టమర్లతో ఎంట్రీ లెవల్ అండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  ఐటెల్ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది, దీని కింద మీరు కేవలం రూ. 299కే స్మార్ట్‌ఫోన్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. 


మీ వద్ద తక్కువ డబ్బు కారణంగా మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనలేకపోతున్నారా... అయితే ఈ వార్త  ఖచ్చితంగా మీకోసమే. ఏడు కోట్లకు పైగా కస్టమర్లతో ఎంట్రీ లెవల్ అండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  ఐటెల్ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది, దీని కింద మీరు కేవలం రూ. 299కే స్మార్ట్‌ఫోన్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఐటెల్  సంస్థ నుండి  వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్స్ ఎ48, ఎ25 ప్రో, విజన్ 1 (3 జిబి), విజన్ 1 ప్రోలను కేవలం రూ .299కు అందిస్తోంది. ఈ ఫోన్‌లన్నింటిలో 4జీ ఎల్‌టీఈతో పాటు ట్రెండీ ఫీచర్లు  ఉన్నాయి.

Latest Videos

కంపెనీ ఈ ఫోన్‌లన్నింటిపై జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఇఎంఐతో కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటినీ రూ.299 కు కొనుగోలు చేయవచ్చు, మిగిలిన మొత్తం నాలుగు ఈజీ ఇఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 4జి  ఫీచర్ కారణంగా ఫీచర్ ఫోన్‌లను వదిలి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది గొప్ప అవకాశం.

also read బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్‌ప్లస్ కొత్త సిరీస్.. మార్చి 23న అఫిషియల్ లాంచ్.. ...

ఈ ఆఫర్ దేశంలోని 26 రాష్ట్రాల్లో 1,200 కి పైగా నగరాల్లోని బజాజ్ డీలర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్  బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్  ప్రస్తుత వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఈ పథకం కింద ఐటిఎల్ ఎ25ప్రో, ఐటిఎల్ ఎ48, విజన్ 1(3 జిబి), విజన్ 1 ప్రో కొనుగోలు కోసం రూ .299 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

దీని తరువాత నాలుగు ఇఎంఐలు అంటే మొదటి నెల రూ .1,275, 2వ నెల రూ .1,525, 3వ నెల రూ .1,750, 4వ నెల రూ.1,725 ​​రూపాయలు చెల్లించాలి. నో కాస్ట్ ఇఎంఐ కింద ఐటిఎల్ ఎ48, విజన్ 1 ప్రో, విజన్ 1(3 జిబి) ను ప్రాసెసింగ్ ఫీజుగా రూ .299 చెల్లించాలి.

ఈ కొత్త ఆఫర్‌పై ట్రాన్షన్ ఇండియా సీఈఓ అరిజిత్ తలపాత్రా మాట్లాడుతూ, "కరోనా మహమ్మారి సమయంలో స్మార్ట్‌ఫోన్ వాడకం చాలా పెరిగింది, దీనివల్ల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను సులభంగా యాక్సెస్ చేయవలసిన అవసరం ఉందని చూపిస్తుంది. ఈ ఫలితంగా చిన్న నగరాల్లో నివసించే మా వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ల సౌలభ్యం మరింతగా లభిస్తుంది. ' అని అన్నారు.

click me!