
చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి ఇప్పటివరకు ఎంఐ టివిలని భారత మార్కెట్లోకి విక్రయించింది, కాని ఇప్పుడు కంపెనీకి చెందిన సబ్ బ్రాండ్ రెడ్‌మి ఒక కొత్త టివిని లాంచ్ చేయాలని నిర్ణయించింది.
అయితే రెడ్‌మి నుండి వస్తున్న మొట్టమొదటి టీవీని మార్చి 17న భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. రెడ్‌మి టీవీ ప్రారంభానికి సంబంధించి కంపెనీ మీడియా ఇన్విటేషన్లు కూడా పంపించింది. భారతదేశానికి ముందు రెడ్‌మి టీవీని చైనాలో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నట్లు సమాచారం.
రెడ్‌మి ఇండియా ట్విట్టర్ లో ఈ లాంచ్ తేదీని ప్రకటించింది, అయితే టీవీ ఫీచర్స్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. మీడియా ఆహ్వానంలో కంపెనీ "ఎక్స్‌ఎల్" ఎక్స్పీరియన్స్ అని మాత్రమే రాసింది.
also read వుమెన్స్ డే సంధర్భంగా మహిళల కోసం ప్రేగ్నేన్సి ట్రాకింగ్ ఫీచర్ తో గార్మిన్ లిల్లీ స్మార్ట్‌వాచ్ లాంచ్...
ఇది కాకుండా లాంచ్ సమయంలో కంపెనీ ఒకే టీవీని లాంచ్ చేస్తుందా లేదా ఇతర మోడళ్లను కూడా ఏకకాలంలో తీసుకొస్తుంద అనేది ఇంకా ధృవీకరించలేదు. చైనాలో రెడ్‌మి బ్రాండ్ చెందిన అనేక టీవీలు ఉన్నాయి, వీటిలో లేటెస్ట్ ప్రీమియం టీవీ రెడ్‌మి మాక్స్, దీని డిస్ ప్లే సైజ్ 86 అంగుళాలు, రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్.
మార్చి 17న మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మి టీవీని భారత్‌లో లాంచ్ చేయనున్నరు. ఈ కార్యక్రమాన్ని కంపెనీ సోషల్ మీడియా పేజీలో, అధికారిక సైట్‌లో ప్రసారం చేయనున్నారు. రెడ్‌మి టీవీలు శామ్‌సంగ్, ఎల్‌జీ, దైవా, వియు, థామసన్, షింకో వంటి సంస్థల టీవీలతో పోటీ పడనుంది.