నథింగ్ ఫోన్ 1పై ఫిర్యాదులతో తలపట్టుకున్న కంపెనీ.. రీప్లేస్‌మెంట్ తర్వాత కూడా కస్టమర్‌ల గగ్గోలు..

By asianet news telugu  |  First Published Jul 27, 2022, 1:06 PM IST

నివేదిక ప్రకారం, నథింగ్ ఫోన్ 1లో ఇండియాలోనే మాత్రమే కాదు, ఇతర దేశాల కస్టమర్లు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. నథింగ్ ఫోన్ 1 సేల్ తాజాగా ప్రారంభమైంది. అయితే చాలా మంది వైర్ టేప్ అమరిక గురించి ఫిర్యాదు చేసారు, దీంతో ఫోన్ తయారీ నాణ్యత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. 


నథింగ్ ఫోన్ 1 అనేది కంపెనీ  మొదటి ఫోన్, అయితే  ఈ ఫోన్ ఫీచర్ల పరంగా  కాకుండా లోపాల వల్ల చర్చనీయాంశంగా నిలుస్తుంది. మొదట్లో నథింగ్ ఫోన్ 1ని ప్రాంక్ వీడియో ద్వారా టార్గెట్ చేశారు, ఆ తర్వాత కంపెనీ క్లారీటి ఇస్తూ నోటీసును జారీ చేయాల్సి వచ్చింది. లాంచ్ తర్వాత నథింగ్ ఫోన్ 1 కొనుగోలు చేసిన కస్టమర్లు  నిరాశ చెందుతున్నారు. నథింగ్ ఫోన్ 1లో సమస్యలు ఒకదాని తరువాత మరోకటి మొదలవుతూనే ఉంది. అయితే మొదట్లో స్క్రీన్‌పై గ్రీన్ టింట్ గురించి ఫిర్యాదులు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు క్వాలిటీపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. 

వాటి స్థానంలో కొత్త ఫోన్లు
నివేదిక ప్రకారం, నథింగ్ ఫోన్ 1లో ఇండియాలోనే మాత్రమే కాదు, ఇతర దేశాల కస్టమర్లు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. నథింగ్ ఫోన్ 1 సేల్ తాజాగా ప్రారంభమైంది. అయితే చాలా మంది వైర్ టేప్ అమరిక గురించి ఫిర్యాదు చేసారు, దీంతో ఫోన్ తయారీ నాణ్యత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. అంతేకాకుండా చాలా మంది ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌ను రీప్లేస్ చేయడం లేదని కూడా చెప్పారు. ఫ్లాష్‌లైట్  నిర్మాణ నాణ్యత,  ఫోన్ వెనుక ప్యానెల్ తో సమస్య ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు.  

Latest Videos

undefined

డ్యామేజ్ ఫోన్  రీప్లేస్మెంట్ 
పాత ఫోన్ పాడైపోయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసి కంపెనీ పంపిన ఫోన్ కూడా పాడైపోయిందని మరో యూజర్ పేర్కొన్నారు. ఈ సమస్యలపై ఇంకా నథింగ్ నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ రీప్లేస్‌మెంట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరిగింది. చాలా మంది  స్క్రీన్  పిక్సెల్‌లు డెడ్ అయ్యాయని ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం, కంపెనీ మొదటి OTA అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది.  

నథింగ్ ఫోన్ 1 ధర, స్పెసిఫికేషన్‌లు 
నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 32,999. ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే Android 12 ఇందులో ఇచ్చారు. ఫోన్ 6.55-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉంది. డిస్ ప్లే బ్యాక్ ప్యానెల్‌పై గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. డిస్ ప్లేతో HDR10+కి సపోర్ట్ ఉంది ఇంకా బ్రైట్‌నెస్ 1200 నిట్స్. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్ 12 GB వరకు LPDDR5 RAM, 256 GB వరకు స్టోరేజ్ ఉంది.

నథింగ్ ఫోన్ 1లో డ్యూయల్ రియర్ కెమెరాలు, 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్‌తో  అపెర్చర్ /1.88, OIS అండ్ EIS రెండింటికీ సప్పోర్ట్ ఉంది. రెండవ లెన్స్ కూడా 50-మెగాపిక్సెల్ Samsung JN1 సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్. దీంతో ఈఐఎస్ స్టెబిలైజేషన్ అందుబాటులోకి రానుంది. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 కెమెరా ఇచ్చారు. పనోరమా నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ఎక్స్‌పర్ట్ మోడ్ కెమెరాతో ఉంటాయి.

click me!