రిజల్యూట్ 4ఐపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎమ్‌ఈ (MSME)లు, స్టార్టప్‌లు, విద్యా సంస్థల కోసం తొలిసారిగా ఇంటలెక్చువల్ ప్రోపర్టీ (మేధో సంపత్తి) స్కోర్ కార్డును ప్రారంభించనున్నట్టుగా Resolute4IP తెలిపింది.
రిజల్యూట్ 4ఐపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎమ్‌ఈ (MSME)లు, స్టార్టప్‌లు, విద్యా సంస్థల కోసం తొలిసారిగా ఇంటలెక్చువల్ ప్రోపర్టీ (మేధో సంపత్తి) స్కోర్ కార్డును ప్రారంభించనున్నట్టుగా Resolute4IP తెలిపింది. ఈ స్కోర్ కార్డు.. ఇంటలెక్చువల్ ప్రోపర్టీ జర్నీని ప్రారంభించడంలో కీలక పరిణామాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రత్యేకమైన యాజమాన్యం, ట్రేడ్‌మార్క్, పేటెంట్, కాపీరైట్, ఇండస్ట్రియల్ డిజైన్, ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్, భౌగోళిక సూచనలను, వంటి వివిధ రకాల IPలను ఆస్వాదించడానికి క్రియేటర్‌ను ఐపీ అనుమతిస్తుంది.
ఇక, రిజల్యూట్4ఐపీ అనేది.. ఎల్‌సీజీసీ రిజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెందిన మేధో సంపత్తి హక్కుల సేవల విభాగం. హైదరాబాద్‌లో ఐపీ శావీ సంస్కృతిని అందించడం రిజల్యూట్ 4ఐపీ లక్ష్యం. తద్వారా తెలంగాణాను ఐపీ ఫైలింగ్స్ పరంగా దేశంలో అగ్రగామి మూడు రాష్ట్రాలలో ఒకటిగా నిలుపడమే లక్ష్యంగా ఇది కృషి చేస్తుంది.