ఈ దేశంలో 1 జి‌బి డేటా ధర మూడున్నర వేలు, అతితక్కువ ధరకే ఇంటర్నెట్ ఎక్కడంటే..

By asianet news telugu  |  First Published Jul 27, 2022, 11:23 AM IST

దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటిష్ భూభాగంలో సెయింట్ హెలెనా అనే దేశం ఉంది, ఇక్కడ 1 జి‌బి డేటా ధర సుమారు $ 41. అతితక్కువ ధర ఇజ్రాయెల్‌లో ఉండగా, ఇక్కడ 1జి‌బి ఇంటర్నెట్ డేటా ధర కేవలం రూ.3 మాత్రమే. 


భారతదేశంలో 4G వచ్చిన తర్వాత ఇంటర్నెట్ డేటా ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు మనం 3Gతో పోలిస్తే చాలా తక్కువ ధరతో ఇంటర్నెట్ డేటాను ఉపయోగిస్తున్నాము. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒక జీబీ ఇంటర్నెట్ డేటాకు రూ.3,500 చెల్లించాల్సిన దేశం కూడా ఉందని మీకు తెలుసా. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటిష్ భూభాగంలో సెయింట్ హెలెనా అనే దేశం ఉంది, ఇక్కడ 1 జి‌బి డేటా ధర సుమారు $41. అతితక్కువ ధర ఇజ్రాయెల్‌లో ఉండగా ఇక్కడ 1జి‌బి ఇంటర్నెట్ డేటా ధర కేవలం రూ.3 మాత్రమే. 

నిజానికి 233 దేశాలలో ఇంటర్నెట్ డేటా ధరలను పోల్చుతు వరల్డ్ వైడ్ మొబైల్ డేటా ధరల లిస్ట్ 2022 విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అతితక్కువ ఇంటర్నెట్ డేటా ధర ఇజ్రాయెల్‌లో ఉండగా, అయితే అత్యంత ఎక్కువ డేటా ధర సెయింట్ హెలెనాలో ఉంది. 

Latest Videos

undefined

నివేదిక ప్రకారం, భారతదేశంలో ఇంటర్నెట్ డేటా ధర్ చాలా చౌకగా ఉంది, కాబట్టి  డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ అతితక్కువ డేటా లిస్ట్ లో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది, ఇక్కడ మనం 1 GB ఇంటర్నెట్ డేటా కోసం దాదాపు రూ. 14 చెల్లించాల్సి వస్తుంది. భారతదేశం కంటే ముందు ఇజ్రాయెల్ (1 GBకి సుమారు రూ.3), ఇటలీ (1 GBకి సుమారు రూ.10), శాన్ మారినో (1 GBకి సుమారు రూ.11), ఫిజీలో 1 GB ఇంటర్నెట్ డేటా ధర దాదాపు రూ.12. దీని తర్వాత భారతదేశం  ఉంది. 

ఇక్కడ ఇంటర్నెట్ అత్యంత కాస్ట్లీ 
ఈ లిస్ట్ లో పాకిస్థాన్ 13వ స్థానంలో ఉంది, ఇక్కడ 1 GB ఇంటర్నెట్ డేటా ధర దాదాపు రూ. 29. USలో, డేటా ధర లిస్ట్ లో సగటుగా పరిగణించబడుతుంది, ఇక్కడ ఒకరు $ 4.98 అంటే ఒక GBకి దాదాపు 400 రూపాయలు చెల్లించాలి. సెయింట్ హెలెనా, ఫాక్‌లాండ్ దీవులు, సో టోమ్ అండ్ ప్రిన్సిపే, టోకెలావ్ ఇంకా యెమెన్‌లలో ఇంటర్నెట్ అత్యంత ఖరీదైనది. 

click me!