స్నేక్ గేమ్‌తో నోకియా బెస్ట్ బడ్జెట్ ఫోన్.. లాంగ్ బ్యాటరీ, ఎఫ్‌ఎం, ఎం‌పి3 ప్లేయర్ ఫీచర్స్ కూడా..

By asianet news teluguFirst Published Aug 3, 2022, 11:14 AM IST
Highlights

నోకియా  8210 4జి సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది, దీనికి 3.8-అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. నోకియా  పాపులర్ స్నేక్ గేమ్,  బ్లూటూత్ V5 సపోర్ట్ కూడా ఉంది.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నోకియా  కొత్త ఫీచర్ ఫోన్ నోకియా 8210 4జీని ఇండియాలో లాంచ్ చేసింది. నోకియా కంపెనీ నోకియా 8210 4Gని మార్కెట్లోకి రెండు కలర్ వేరియంట్‌లలో అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పరిచయం చేసింది. ఈ ఫోన్ సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది, దీనికి 3.8-అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. Nokia 8210 4G బ్లూటూత్ V5కి సపోర్ట్ తో నోకియా  పాపులర్ స్నేక్ గేమ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. మీరు ఈ ఫోన్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్‌లను చూస్తారంటే..

నోకియా  8210 4జి
నోకియా  ఫీచర్ ఫోన్ Nokia 8210 4G ధర రూ. 3,999 వద్ద లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని డార్క్ బ్లూ అండ్ రెడ్ షేడ్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. Nokia 8210 4Gని నోకియా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఫోన్‌తో ఒక సంవత్సరం రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా అందిస్తోంది. 

 స్పెసిఫికేషన్లు
ఈ Nokia ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో 3.8-అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. 128ఎం‌బి ర్యామ్‌తో 48ఎం‌బి స్టోరేజ్  ఉంది, దీనిని మైక్రో SD కార్డ్ సహాయంతో 32జి‌బి వరకు పెంచుకోవచ్చు. Unisoc T107 ప్రాసెసర్ ఫోన్‌లో ఉంటుంది. ఫోన్ సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. నోకియా 8210 4Gలో 0.3-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. 

1450mAh బ్యాటరీ నోకియా 8210 4Gలో ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్‌పై 27 రోజుల స్టాండ్‌బై  టైం పొందవచ్చని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ ఫోన్‌లో FM రేడియో, MP3 ప్లేయర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రో USB పోర్ట్ ఉన్నాయి. దీనితో పాటు స్నేక్, టెట్రిస్, బ్లాక్‌జాక్ వంటి గేమ్‌లతో కూడిన ఎల్‌ఈడీ టార్చ్ కూడా ఫోన్‌లో అందించారు. ఫోన్ బరువు 107 గ్రాములు. 

click me!