
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQoo)ఫ్లాగ్‌షిప్ సిరీస్ 9లో మరో స్మార్ట్‌ఫోన్ వచ్చి చేరింది. కంపెనీ ఈరోజు అంటే ఆగస్టు 2న iQoo 9T 5Gని ఇండియాలో లాంచ్ చేసింది. iQoo 9T 5G Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, Vivo V1+ ఇమేజింగ్ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4,700mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. మీరు ఈ ఫోన్‌లో ఏ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను పొందుతున్నారో తెలుసుకోండి..
ధర
iQoo 9T 5G ఆల్ఫా అండ్ లెజెండ్ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు. అలాగే రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసారు. 8 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. iQoo 9T 5Gని కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ నుండి ఆగస్టు 2 నుండి కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోళ్లు చేస్తే కస్టమర్లకు రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది.
స్పెసిఫికేషన్‌లు
iQoo 9T 5G Android 12 ఆధారిత Funtouch OS 12తో వస్తుంది. 6.78-అంగుళాల పూర్తి HD ప్లస్ E5 AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 1,080 x 2,400 పిక్సెల్‌లు రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లేలో 1500 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ కూడా కనిపిస్తుంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, Vivo యొక్క V1+ ఇమేజింగ్ చిప్ ఫోన్‌లో సపోర్ట్ చేస్తుంది. 256 GB UFS 3.1 స్టోరేజ్‌తో పాటు 12 GB వరకు LPDDR5 RAM ఉంది.
కెమెరా
iQoo 9T 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది, ఇంకా 50-మెగాపిక్సెల్ ISOCELL GN5 ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ తో వస్తుంది. ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 12-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
iQoo 9T 5G 4,700mAh బ్యాటరీతో వస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీకి సంబంధించి కేవలం 8 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం iQoo 9T 5Gలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, NFC, GPS/ A-GPS, FM రేడియో, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, E-కంపాస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇతర స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్ (MEMC), ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్‌లో ఇచ్చారు.