నెలాఖరులోగా విపణిలోకి? 9 కెమెరాలతో ‘నోకియా9’!!

By Arun Kumar P  |  First Published Sep 16, 2018, 11:47 AM IST

ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే నోకియా సంస్థ పెట్టింది పేరు. పలు సంస్థల రంగ ప్రవేశంతో వెనుకబడ్డ నోకియా తాజాగా సరికొత్త ఫీచర్లతో ‘నోకియా9’ ఫోన్ అందుబాటులోకి తేనున్నదని తెలుస్తోంది. అంతా సవ్యంగా సాగితే ఈ నెలాఖరు నాటికి విపణి వీధిలో అడుగుపెట్టబోతోందని సమాచారం.


ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటేనే నోకియా.. ఆ క్రేజ్ వేరే. నోకియా నుంచి ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌ వస్తుందంటే, మొబైల్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఆశలను మరింత పెంచుతూ.. హెచ్‌ఎండీ గ్లోబల్‌ త్వరలో ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తేనున్నది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇమేజ్‌లు పలు సోషల్‌ మీడియా వెబ్‌సైట్లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఇమేజ్‌లతో ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ అతిపెద్ద బ్యాటరీతో ఈ నెలాఖరు నాటికి మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. 

అదేవిధంగా వెనుకవైపు పెంటా-లెన్స్‌‌ (ఐదు లెన్స్‌ల) కెమెరా సెటప్‌ను ఇది కలిగి ఉందని సమాచారం. చైనాకు చెందిన ఓ సర్టిఫికేషన్‌ సైట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పాట్‌ అయింది. నోకియా పవర్‌యూజర్‌ వెబ్‌సైట్‌ కూడా నోకియా 9 లైవ్‌ ఇమేజ్‌ను లీక్‌ చేసింది. ఈ లీకేజీల్లో కూడా ఫోన్‌కు వెనుకవైపు ఐదు లెన్స్‌ల కెమెరా సెటప్‌ ఉందని తెలుస్తోంది.

Latest Videos

undefined

ఈ ఫోన్‌ 4,150ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. అది నాన్‌ రిమూవబుల్‌ అట. ఈ లీక్డ్‌ డివైజ్‌ వెనుకవైపు నీలంగా ఉంది. అంటే నోకియా 9 కలర్‌ ఆప్షన్లలో నీలం రంగు ఒకటని తెలుస్తోంది. నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను గత నెలాఖరు నుంచి ఉత్పత్తి చేయడం మొదలు పెట్టింది హెచ్‌ఎండీ గ్లోబల్‌. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

‘నోకియా 9 'ఆండ్రాయిడ్‌ పై' ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుందని అంతకుముందు నివేదికలొచ్చాయి. అంతేగాక.. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 6.01 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది.

అంతకుముందు ఈ ఫోన్‌లో ముందువైపు మూడు కెమెరాలు ఉంటాయని ఆ నివేదికలు వచ్చాయి. కానీ తాజా లీకేజీల ద్వారా నోకియా 9లో వెనుక వైపు ఐదు, ముందు వైపు మూడు కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు సమాచారం. 

click me!