రూ.29,900లకే ‘ఐఫోన్’: భారత్‌లో ఇది అట్రాక్టివ్ మరి!!

By Arun Kumar P  |  First Published Sep 14, 2018, 8:07 AM IST

తాజాగా అత్యాధునిక ఫీచర్లతో మూడు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన యాపిల్.. భారతదేశంలో గత వెర్షన్ మొబైల్ ఫోన్ల ధరలు గణనీయంగానే తగ్గించి వేసింది. యాపిల్ ఐఫోన్ కొనాలని వారికి రూ.29,900లకే ఫోన్ అందుబాటులోకి రానున్నది.


అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ విపణిలోకి తాజాగా ఐఫోన్‌ ఎక్స్ ఆర్‌, ఎక్స్ఎస్‌, ఎక్స్ఎస్‌ మ్యాక్స్‌ మోడల్ ఫోన్లను విడుదల చేసిన టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే దిశగా అడుగులేసింది.

తొలిసారి డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌ స్టాండ్‌ బైతో మూడు రకాల ఫోన్లను ఆవిష్కరించిన యాపిల్ ఇప్పటికే విపణిలో ఉన్న ఐఫోన్‌ టెన్‌, ఐఫోన్‌ 8ప్లస్‌ సహా పలు మొబైల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. త్వరలోనే ఈ ధరలను భారత్‌లోనూ అమలు చేయనుంది. కొనుగోలు దారుల అభిరుచులు, సామర్థ్యానికి అనుగుణంగా రూ.29, 900లకే అందుబాటులోకి రానున్నాయి ఐఫోన్లు.

Latest Videos

యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ సిరీస్‌లో మొబైళ్ల ధరను భారీగా తగ్గించింది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 32జీబీ మోడల్‌ ధర రూ.52,240 ఉండగా, ఇప్పుడు రూ.34,900లకే లభించనున్నది. ఇక ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 128జీబీ వేరియంట్‌ ధర రూ.61,450 నుంచి రూ.44,900కు తగ్గించింది.

ఐఫోన్‌ 6ఎస్‌ బేసిక్‌ వేరియంట్‌ రూ.29,900 ప్రారంభం అవుతుండగా, హైఎండ్‌ మొబైల్‌ ధర రూ.39,900గా ఉంది. అమెరికా మార్కెట్ నుంచి ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎక్స్ మోడల్ ఫోన్లను ఉపసంహరించిన యాపిల్.. భారతదేశంలో కొనసాగించడంతోపాటు ధరలు తగ్గించడం ఆసక్తికర పరిణామం. భారత్‌లోనూ ఐఫోన్ ఎస్ఈ మోడల్ మాత్రమే ఉపసంహరించింది. మిగతా మూడు మోడల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గించి వేసింది యాపిల్.  

గతేడాది మార్కెట్‌లోకి విడుదల చేసిన ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర ప్రస్తుతం రూ.95,390 ఉండగా, రూ.91,900 నుంచి ప్రారంభం కానుంది. టాప్‌ ఎండ్‌ 256 జీబీ వేరియంట్‌ మోడల్ ఫోన్ ధర రూ.1,08,930 ఉండగా, ఇక నుంచి రూ.1,06,900 లభించనుంది. ఐఫోన్‌ 8 ప్లస్‌ ధరను సైతం యాపిల్‌ తగ్గించింది. 64జీబీ ఇక నుంచి రూ.69,900లకే లభించనుంది. గతంలో దీని ధర రూ.77,560గా ఉండేది. ఐఫోన్‌8 ప్లస్‌ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.91,110 నుంచి రూ.84,900లకు తగ్గించింది.

‘ఐఫోన్‌ 8’ 64జీబీ వేరియంట్ మోడల్ ఫోన్ ధర రూ.67,940 ఉండగా, ఇప్పుడు రూ.59,900లకే లభించనుంది. ఐఫోన్‌ 8 టాప్‌ ఎండ్‌ మొబైల్‌ ధరను రూ.81,500 నుంచి రూ.74,900లకు తగ్గించింది. ‘ఐఫోన్‌ 7ప్లస్‌’ 32జీబీ, 128జీబీ వేరియంట్‌ ధరలు వరుసగా రూ.49,900, రూ.59,900లకే లభించనున్నాయి. ఇక ‘ఐఫోన్‌ 7’ 32జీబీ వేరియంట్‌ను రూ.52,370 నుంచి రూ.39,900లకు తగ్గించింది. అలాగే ఐఫోన్‌7 128జీబీ ధరను కూడా రూ.61,560 నుంచి రూ.49,900లకు తగ్గించింది.

మూడు రకాల ఐఫోన్ మోడల్స్‌తోపాటు వాచీ సిరీస్ 4నూ విడుదల చేసిన యాపిల్.. యాపిల్ వాచీ3 సిరీస్ ధరను కూడా తగ్గించింది. యాపిల్ వాచీ సిరీస్ 3 జీపీఎస్ ధర రూ.28,900తో ప్రారంభమవుతుంది. యాపిల్ వాచీ సిరీస్3 సెల్యూలార్ ఎడిషన్ రూ.37,900 నుంచి ప్రారంభమవుతుందని యాపిల్ ఇండియా వెబ్ సైట్ ప్రకటించింది. అమెరికా యాపిల్ వాచీ సిరీస్ 3 రమారమీ 279 డాలర్లు (రూ.20,100) పలుకుతుంది. 

click me!