మార్కెట్‌లోకి యాపిల్ ‘ఐఫోన్’ సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. 21 నుంచి ఫ్రీ బుకింగ్‌లు

By sivanagaprasad Kodati  |  First Published Sep 13, 2018, 7:33 AM IST

టెక్నాలజీ మేజర్ ‘యాపిల్‌’ తొలిసారి తన వినియోగదారుల కోసం డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌లను ఆవిష్కరించింది.  కొత్త ఐఫోన్‌తోపాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ‘ఐఫోన్‌ 10ఎస్‌’ ఫోన్లు ఆవిష్కరించారు. 


టెక్నాలజీ మేజర్ ‘యాపిల్‌’ తొలిసారి తన వినియోగదారుల కోసం డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్‌లను ఆవిష్కరించింది.  కొత్త ఐఫోన్‌తోపాటు పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ‘ఐఫోన్‌ 10ఎస్‌’ ఫోన్లు ఆవిష్కరించారు. 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల (ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఇవి లభిస్తాయి. 512 గిగా బైట్స్ (జీబీ) వరకు మెమరీ ఉంటుంది.

ఈ దఫా మార్కెట్‌లోకి విడుదల చేసిన మోడల్స్ ఫోన్లలోనూ డ్యూయల్‌ సిమ్‌ ఆప్షన్‌‌ను చేర్చారు. యాపిల్ విడుదల చేసిన మూడు స్మార్ట్ ఫోన్లు కూడా పాకెట్ ఫ్రెండ్లీ వర్షన్‌తో రూపొందించారు. ఐపోన్ ఎక్స్ఎస్ ధర 999, యాపిల్ ఎక్స్ఎస్ మాక్స్ ధర 1099 డాలర్ల వరకు పలుకుతుంది. ఇక ఐపోన్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్ మాత్రం 749 డాలర్లకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో యాపిల్ ‘ఐఫోన్’ ప్రీ బుకింగ్ ఈ నెల 21 నుంచి 30 వరకు సాగుతాయి. అయితే భారతదేశంలో ఎప్పుడు మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయన్న సంగతి ఐఫోన్ ప్రకటించలేదు. కానీ ఈ నెల 28న మార్కెట్ లో లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. 

Latest Videos

undefined

యాపిల్ ఐఫోన్ ఎక్స్ సిరీస్ లో తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ ఫీచర్ ఫోన్లలో 7- నానోమీటర్, ఏ12 బయోనిక్ చిప్ అమర్చారు. దీనివల్ల ఏ11 బయోనిక్ చిప్ కంటే 15 శాతం వేగంగా పని చేస్తుంది. 40 శాతం బ్యాటరీ ఉండటంతోపాటు గ్రాఫిక్స్ తోపాటు 50 శాతం వేగంగా పని చేస్తుంది. ఏ12 బయోనిక్ చిప్ వల్ల సెకన్‌కు 50 లక్షల సార్లు గణించడం దీని స్పెషాలిటీ. ఫాస్టర్ ఫేస్ ఐడీ తోపాటు ఇతర కృత్రిమ మేధస్సుతో కూడిన అదనపు ఫీచర్లు లభిస్తున్నాయి. 

పాత ఐఫోన్ ఎక్స్ డిజైన్‌నే నూతన ఫోన్లు కలిగి ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వీడియో యాప్స్‌తో మనకు కావాల్సిన హెచ్డీఆర్ కంటెంట్ సజావుగానే పొందొచ్చు. నూతన బయోనిక్ ఏ12 చిప్ వల్ల పాతవాటితో పోలిస్తే 9 రెట్లు వేగంగా పని చేస్తుంది. 

ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ మ్యాక్స్ ఫోన్లలో 12 మెగా ఫిక్సెల్ వైడ్ యాంగిల్, 12 మెగా ఫిక్సెల్ టెలిఫొటో లెన్స్ లభిస్తాయి. సామ్ సంగ్ హై హెండ్ స్మార్ట్ ఫోన్లలో మాదిరిగా పిక్స్‌ను మనకు అవసరమైన మేరకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్, మ్యాక్స్ మోడల్ ఫోన్లలో అదనంగా అర్ధగంట బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం ఉంది. డ్యుయల్ సిమ్ వెసులుబాటు గల ఈ ఐఫోన్లలో ఒకటి భౌతికంగా అమర్చడంతోపాటు రెండో ఈ- సిమ్ ఏర్పాటు చేయొచ్చు.

యాపిల్ ఎక్స్ఆర్ మోడల్ ఫోన్‌ 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, 12 మెగా ఫిక్సెస్ ప్రైమరీ కెమెరా కలిగి ఉన్నది. ఎక్స్ఎస్, మ్యాక్స్ మోడల్ ఫోన్లతో పోలిస్తే 90 నిమిషాల అదనంగా బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ స్మార్ట్ ఫోన్లలోనూ ఇంతకుమందు యాపిల్ ఫ్లాగ్ షిప్ ఫీచర్లు, ఫేస్ ఐడీ, న్యూరల్ ఇంజిన్, పొట్రైట్ మోడ్ ఫొటోగ్రఫీ అందుబాటులో ఉన్నాయి. ఈ- సిమ్ కోసం రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని యాపిల్ ధ్రువీకరించింది. 

వాచ్‌లలో సిరీస్‌ 4ను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది. పాత వాటితో పోలిస్తే ఈ వాచ్‌ల స్క్రీన్‌ 30 శాతం పెద్దదిగా ఉంటుంది. కిందపడిపోయే అవకాశాలను కూడా ముందే గుర్తించి హెచ్చరించగలిగే చిప్‌ను  ఇందులో పొందుపర్చారు. గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. 30 సెకన్లలో ఈసీజీ  తీసుకోవచ్చు.

వీటి ధర 399 డాలర్ల నుంచి 499 డాలర్ల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే యాపిల్ వాచ్ సిరీస్ 3 ధరను రిటైల్ మార్కెట్‌లో 279 డాలర్లకు తగ్గించి వేసింది. యాపిల్ వాచ్ సిరీస్ 4 గత వాచీతో పోలిస్తే 30 శాతం అదనంగా స్క్రీన్ ఉంటుంది. ఎస్4తో అభివ్రుద్ధి చేసిన యాపిల్ వాచీ సిరీస్ 4లో 64 బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అమర్చారు.  

click me!