ఐదు నెలల తర్వాత భారత విపణిలోకి నోకియా 9 ప్యూర్ వ్యూ: ధరెంతంటే..

By rajesh yFirst Published Jul 10, 2019, 3:36 PM IST
Highlights

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లోకి నోకియా 9 ప్యూర్ వ్యూను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.49 వేలుగా నిర్ణయించారు. తొలి 30 రోజుల్లో కొంటే 10 శాతం, హెచ్ డీఎఫ్ సీ కార్డుతో కొంటే 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. నోకియా వెబ్ సైట్ నుంచి ఆర్డర్ చేస్తే రూ.9000 విలువైన గిఫ్ట్ ఓచర్లు లభిస్తాయి.

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన ఐదు కెమెరాల ఫోన్‌ ‘నోకియా 9 ప్యూర్‌ వ్యూ’ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను గత ఫిబ్రవరిలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఆవిష్కరించారు. భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మాత్రం ఐదు నెలలుపట్టింది. 12 మెగా పిక్సెల్‌ సామర్థ్యం కలిగిన రెండు ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లతో పాటు మరో మూడు మోనోక్రోమ్ సెన్సార్‌లు గల ఐదు కెమెరాలు ఉండడం దీని స్పెషాలిటీ. 

 

నోకియా ప్యూర్‌ వ్యూ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నోకియా స్టోర్‌లో అమ్మకానికి ఉంచారు. దీని ధర 49,999గా నిర్ధరించారు. ప్రధాన రిటైల్‌ స్టోర్లకు ఇది ఈ నెల 17 కల్లా చేరుతుందని హెచ్‌ఎమ్‌డీ ప్రకటించింది. మిడ్‌నైట్‌ బ్లూ కలర్‌లో లభించనుంది. ఫోన్ ఆవిష్కరణ నేపథ్యంలో ఔత్సాహికుల కోసం ధర విషయంలో పలు ఆఫర్లు ప్రకటించారు. తొలి 30 రోజుల్లో కొనుగోలు చేసిన వారికి 10 % క్యాష్ బ్యాక్, ఇతర రాయితీలను హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. హెచ్ డీఎఫ్ సీ కార్డుపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్. నోకియా వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేస్తే రూ.5000 వరకు గిఫ్ట్ ఓచర్లు లభిస్తాయి. నోకియా 9 ప్యూర్ వ్యూతోపాటు లిమిటెడ్ ఆఫర్‌లో నోకియా 705 ఇయర్ బడ్స్ లభిస్తాయి. 

 

నోకియా 9 ఫ్యూర్‌ వ్యూ ఫోన్ 6 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ తోపాటు ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ అమర్చారు. 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం దీని స్పెషాలిటీ. 12 ఎంపీ పెంటా రేర్‌ కెమెరాతోపాటు 3,320 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ సౌకర్యం కూడా ఉంది. 

click me!